నవరాత్రికి షి ర్డీ సాథుని దర్శనం

భారత్ లో అత్యంత సందడిగా, అంతకు మించి సంప్రదాయ బద్దంగా జరిగే పండుగలలో నవరాాత్రులు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.  రక రకాల నవరాత్రి ఉత్సవాలు భారత్ లో నిర్వహిస్తారు. నవ రాత్రులు అంటే తొమ్మిది రోజుల  పండుగ. వినాయక  నవరాత్రులు, వసంత నవరాత్రులు, దుర్గా నవరాత్రులు ఇలా పలు నవరాత్రి ఉత్సవాలు భారత దేశంలో నిర్వహించడం కద్దు. అక్టోబర్ లో  దేశమంతా దుర్గానవరాత్రులను జరుపు కుంటారు. ఈ పండుగలలో ప్రతి ఒక్కరూ తమ ఆరాధ్యదైవాలను పూజిస్తారు.  ఒక్కో ప్రాంతంలో ఈ దుర్గా నవరాత్రులు ఒక్కో విధంగా జరుగుతాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లు ఉండేే బా భారత్ లో ని  పూరా విశ్వాసాలు విశేషాలు ఈ నవరాత్రులలో ప్రతిబింబిస్తాయి. తెలంగాణలో బతుకమ్మను పూజిస్తారు.  ఉత్తర భారత దేశంలో  దాండియా ఆడుతారు. కర్ణాటకలో జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా  నవరాత్రులు జరుపుతారు.

తెరచుకోన్న షిర్డీ సాయి ఆలయం

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి ఉద్దేవా థాక్రే నేతృత్వంలోని  ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. నాడు నెలకొన్న పరిస్థితుల ప్రభావం అలాంటిది మరి. అందులో భాగంగా మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా మూసివేశారు.తర్వాతి ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఆలయాన్ని మూసే ఉంచనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు ఏప్రిల్‌ 5వ తేదీన ప్రకటించారు..

తాజాగా కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ వరుసగా దేశంలోని పలు ఆలయాలు తెరుచుకుంటున్నాయి.ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమలలో వెలసి యున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా చాలా రోజుల క్రితం నుంచే భక్కులను దర్శనానికి అనుమతిస్తోంది. ఆ దేవస్థానం పాలక మండలి ఎప్పటి అప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటోంది. ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న వారికే దర్శన భాగ్యం అందజేస్తున్నారు. విజయవాడలని కనకదర్గ ఆలయంలోనూ ఆన్ లైన్ బుకింగా ద్వారాన్ దర్శనం లభిస్తోంది. తెలంగా|ణ లోేని పలు ఆలయాల్లో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆలయాల్లోనికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. షిర్డీ సాయినాథుని ఆలయాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది.దుర్గా నవరాత్రి మొదటి రోజు నుండి, అంటే అక్టోబర్ 7వ తేదీ నుండి కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తుల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా స్థలాలను తెరవాలని నిర్ణయించినట్టు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. దీంతో సాయి నాథుని దర్శనం భక్తులకు లభించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: