దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటిగా కొనసాగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ కాలంతో సంబంధం లేకుండా భక్తుల తాకిడి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే  భక్తులు ఎప్పుడు ఎక్కడ ఉంటారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయం తీసుకుంటారు టీటీడీ అధికారులకు. స్వామివారి దర్శనానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.


 ఇప్పుడు టిటిడి బోర్డు అధికారులు మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండపై ఉన్న ప్రైవేట్ హోటళ్లను తొలగించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలలో ప్రైవేట్ హోటళ్లను తొలగించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం టీటీడీ పద్మావతి ఆలయం ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది టిటిడి బోర్డు.


 సీఎం దగ్గర నుంచి సామాన్యుల టీటీడీ అన్నప్రసాదం తినాల్సిందే అంటూ స్పష్టం చేసింది టీటీడీ బోర్డు. శ్రీవారి ఆలయంలో గురుద్వారం, బంగారు వాకిలి, ఆనంద నిలయాలకు బంగారు తాపడం పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. అంతేకాకుండా అన్నమయ్య మార్గం రెండు మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక తిరుపతి అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించాలని ఈ సమావేశంలో టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఇక శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం కోసం 150 కోట్లు విడుదల చేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయిం చింది.  కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన అర్జిత సేవలు ప్రారంభిస్తు టిక్కెట్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమైంది టీటీడీ బోర్డు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd