
దేవుడికి కొబ్బరికాయ కొట్టడం ... ఏ మంచి పనికి.. శుభ కార్యాలకు అయినా ముందుగా కొబ్బరికాయ కొట్టడం అనేది మన భారతీయ సంస్కృతి లో ఎప్పటి నుంచో ఉన్న అంతర్భాగం. కొబ్బరికాయకు చివర్లో కొంత పీచు అలా ఉంచేస్తారు. ఇలా కొంత పీచును ఉంచడం వెనుక కారణం ఉంది. కాయకు నిలువుగా మూడు చారలు కనిపిస్తాయి. ఆ మూడు భాగాలకూ మూడు కళ్ళు ఉంటాయి. కొబ్బరికాయకు ఉండే ఈ మూడు కళ్ళ ను దృష్టి లో ఉంచుకుని ''ముక్కంటి'' అంటారు. కుడివైపు భాగాన్ని సూర్యనాడి అని , ఎడమవైపు భాగాన్ని చంద్రనాడి అని రెండు భాగాలకు మధ్య ఉన్న పెద్ద భాగాన్ని బ్రహ్మనాడి అని అంటారు. సూర్య, చంద్ర, బ్రహ్మ నాడులు కలిసినప్పుడే జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మ, పరమాత్మలో కలిసిపోతుంది. అంటే మోక్షం కలుగుతుంది. ఈ విషయం తెలియ చేయటానికే పీచు తీసివేయమని చెబుతారు. అంటే మానవుని గమ్యం మోక్షమని ప్రబోధం అని చెప్పాలి.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.
నోట్ : వ్యక్తిగత, కుటుంబ సమస్యలు వద్దు