ఇది మనం ఎక్కువగా వినే ఉంటాం.  మన ఇంట్లోనే పెద్ద వాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఒక మాట చెబుతూ ఉంటారు . ఎవరైనా శివాలయానికి వెళ్తున్నామంటే జాగ్రత్త ..కొబ్బరికాయ కొట్టి ఇంటికి తెచ్చుకోకూడదు అని కచ్చితంగా వందలో 80 శాతం మంది పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు.  ప్రతిసారి శివాలయం కి వెళ్లే ముందు మన ఇంట్లోని ఎవరో ఒకరు  ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు.  ఎందుకని  సోమవారం శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి కొబ్బరికాయ తెచ్చుకోకూడదు..? నిజంగానే కొబ్బరికాయ తెచ్చుకుంటే అరిష్టమా..? దోషం జరుగుతుందా..? ఆ ఇంట్లో ఏమైనా చెడు జరుగుతుందా..? లేదా ఇది ఒక మూఢనమ్మకం మాత్రమేనా..? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..!! ఇది చదివితే కచ్చితంగా మీకు అసలు ఎందుకు కొబ్బరికాయని తెచ్చుకోకూడదు దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది పూర్తిగా తెలుస్తుంది..!


దీని వెనక ఒక పెద్ద కథే ఉంది.  కథ ఏంటంటే .."ఒక బ్రాహ్మణ పిల్లాడు ఉంటాడు.  అతడు వేదాలన్నీ చక్కగా చదివేస్తూ ఉంటాడు . ఒకరోజు ఎవరో ఆవులని కొట్టడాన్ని చూసి ఆ బ్రాహ్మణుడి పిల్లాడి కోపం వస్తుంది . ఆ పిల్లవాడు తానే ఆవులన్నీ రక్షిస్తాను అంటూ భీష్ముంచుకుని కూర్చుంటాడు.  రోజు తను వేదాలను చదువుకుంటూ ఆవులను కాపాడుతూ ఉండేవాడు.  కాగా రుద్రం కూడా చదువుతూ ఉండేవాడు ఆ బ్రాహ్మణ పిల్లాడు . రుద్రం చదవడం అంటే ఎంత గొప్ప విషయం అనేది అందరికీ తెలిసిందే . రుద్రం చదువుతూ ఒక రోజు ఇసుకతో శివలింగాన్ని  కడుతూ ఉంటాడు . అదే సమయంలో పాలని తీసి అభిషేకం చేస్తాడు.



మనసంతా కూడా ఈశ్వరుడి మీద పెట్టి ..ఓం నమః శివాయ .. ఓం నమః శివాయ ..ఓం నమః శివాయ  అంటూ ఇసుకతో చేసిన శివలింగానికి పాలను పోస్తూ ఉంటాడు.  అయితే అక్కడికి వచ్చిన తండ్రి మాత్రం అది చూసి నవ్వుకుంటాడు . తండ్రి వచ్చి ఇసుకతో చేసిన శివలింగాన్ని కాలితో తంతాడు . అప్పుడు వెంటనే ఆ బ్రాహ్మణ పిల్లాడికి కోపం వచ్చేస్తుంది.  అక్కడ ఉన్నది ఎవరు..?  తనకు ఏమవుతారు ..?? అని సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ పిల్లవాడు తన తండ్రి రెండు కాళ్ళని తొడ వరకు నరికేస్తాడు .



దీంతో అక్కడికక్కడే తండ్రి చనిపోతాడు . ఇసుకలో కట్టిన శివలింగం నుండి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు . ఇకనుండి నువ్వు కూడా మా కుటుంబంలో ఒకడివి అని చెప్పడమే కాకుండా నిన్ను చండీశ్వరుడు అని కూడా అంటారు అని పార్వతీ పరమేశ్వరులు అతనితో చెప్తారు . అంతేకాదు శివుడు నేను తిని విడిచిపెట్టిన భోజనాన్ని చండీశ్వరుడు తింటాడు అని కూడా చెప్తాడు.  అందుకే చాలామంది అంటుంటారు శివుడికి కొబ్బరికాయ కొట్టి అది నైవేద్యంగా ప్రసాదంగా చండీశ్వరుడికి సమర్పించాలి అని .. ఆ కారణంగానే శివుడికి కొట్టిన కొబ్బరికాయను చండీశ్వరుడికి వదిలేయాలే కానీ ఇంటికి తెచ్చుకోకూడదు అని చెప్తూ ఉంటారు కొంతమంది పెద్ద వాళ్లు.



కానీ కొంతమంది పండితులు చండీశ్వరుడికి ఆలయంలో కొబ్బరికాయను చూపించి ఒక ముక్కను అక్కడ పెట్టి ఇంటికి కొబ్బరికాయ తెచ్చుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు . పూర్ణ అధికారం అప్పుడే వస్తుందట . అయితే కొంతమంది పండితులు మాత్రం అలాంటిదేమీ లేదు అని మనం శివయ్యకు కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోవచ్చు అని .. కానీ కొబ్బరికాయను దేవుడికి పూజించిన తర్వాత అది మాంసాహారం ఉండే పదార్థాల్లో వేయకుండా ఏదైనా తీపి చేసుకొని తినడమే ఉత్తమం మంచిది అని చెప్తూ ఉంటారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: