గత కొన్ని రోజుల నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని ఎక్కడ మిస్ అవకుండా ప్రతి మ్యాచ్ వీక్షిస్తూ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందుతున్న క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ప్రస్తుతం ఎదురుచూస్తున్న మ్యాచ్ నేడు జరగబోతుంది. ఇటీవలే లీగ్ దశ మ్యాచ్లు ముగియడంతో ఇక ఇప్పుడు ప్లే ఆఫ్ లో మ్యాచ్ లు మరింత రసవత్తరంగా మార్చబోతున్నాయి. ఉత్కంఠభరితమైన పోరులో ఎవరు నిలిచి గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతుంది.


 ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్లో విజయం ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన వారు నేరుగా ఫైనల్ కు చేరుకుంటారు అన్న విషయం తెలిసిందే. తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో ఓడినవారు అటు ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు తో రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో పోటీపడతారు. ఇలా నేడు జరగబోయే తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ ఓడిన జట్టు ఫైనల్ చేరుకునేందుకు మరో అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. కాగా బ్యాటింగ్ లో  అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, రాహుల్ తేవాటియా లతో అటు గుజరాత్ టైటాన్స్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో జోస్ బట్లర్, సంజూ శాంసన్, హెట్ మేయర్ లు మరోసారి తమ బ్యాట్ కు పని చెప్పారు అంటే ఇక రాజస్థాన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల బలాబలాలు కూడా సమానం గానే ఉన్నాయి అని చెప్పాలి. గుజరాత్ మొదటిసారి ప్లే ఆఫ్లో అడుగుపెడితే రాజస్థాన్ చాలా రోజుల తర్వాత ప్లే అవకాశం దక్కించుకుంది. దీంతో రెండు జట్లు కూడా ఎంతో కసిగానే కనిపిస్తూ ఉన్నాయి. నేడు సాయంత్రం జరగబోయే మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: