ఇలా అద్భుతమైన ప్రతిభతో అదరగొడుతున్న సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు వరకు అటు భారత జట్టు తరఫున టెస్టు ఫార్మాట్లో మాత్రం అరంగేట్రం చేయలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ టెస్టు ఎంట్రీ ఎప్పుడూ ఉంటుందో అని అభిమానులు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అటు అంతర్జాతీయ టెస్టులలో అరంగేట్రం చేయడమే లక్ష్యంగా రంజీ ట్రోఫీలో బరిలోకి దిగి అదరగొడుతున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఈ క్రమంలోనే ముంబై తరుపున హైదరాబాద్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే ఇరగదీసాడు అని చెప్పాలి.
ఏకంగా 80 బంతుల్లో 15 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 90 పరుగులు చేశాడు. 112 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు అని చెప్పాలి. ఇక సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో కూడా సూర్యకుమార్ రాణించాడు. మొత్తంగా 107 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ 14 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 95 పరుగులు చేశాడు. ఇలా వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్ ఇక మరికొన్ని రోజుల్లో టెస్ట్ ఎంట్రీ కి మార్గాన్ని సగం చేసుకుంటున్నాడు అంటూ ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇప్పటికే టీ20 వన్డే ఫార్మట్లలో తన విధ్వంసం సృష్టిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఇక టెస్టులలో ఎలాంటి ప్రభావం చూపబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి