బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం కావడానికి స్వదేశీ క్రికెటర్లే కాదు విదేశీ క్రికెటర్లు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ లీగ్ లో పాల్గొనడం వల్ల ఒకవైపు భారీగా ఆదాయంతో పాటు ఇంకోవైపు పేరు ప్రఖ్యాతలు కూడా వస్తూ ఉంటాయి. అంతకు మించిన అనుభవం కూడా ప్లేయర్ల సొంతం అవుతూ ఉంటుంది అని చెప్పాలి.


 అయితే ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు సీనియర్ ప్లేయర్ల కంటే యువ ఆటగాళ్లదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంటుంది. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలని కలలుగంటున్న ఎంతోమంది యువ ప్లేయర్స్ ఐపీఎల్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఐపిఎల్ లో కూడా ఎంతోమంది ప్రతిభ గల  యంగ్ ప్లేయర్స్ తెరమీదకి వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ ఏడాది  కూడా ఇలా యంగ్ ప్లేయర్స్ తమ ఆటతో సంచలనం సృష్టించారు.



 ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నో టీం పై విజయం సాధించిన ముంబైకి అభినందనలు తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్.. యువ ఆటగాళ్ల ప్రతిభను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముంబై ప్లేయర్ ఆకాష్ మద్వాల్ అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్స్ కూడా అద్భుతంగా రానిస్తున్నారు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పటిలాగానే ఈ ఏడాది ఐపీఎల్ కూడా అటు భారత జట్టుకు ఫ్యూచర్ స్టార్స్ ని ఇచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl