సాధారణంగా భారత్ లో క్రికెటర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు అంటే చాలు ఇక ఆ క్రికెటర్లు ఏం చేస్తున్నా కూడా అభిమానులందరూ కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో అటు అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్న ప్లేయర్లకు మాత్రమే కాదు ఐపిఎల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారికి కూడా సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోతూ ఉంది అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు ఛాన్స్ దక్కించుకుని  బాగా రాణించాల్సిన పనిలేదు.. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది క్రేజ్ సంపాదించుకుంటూ.. ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటూ ఉన్నారు. దీంతో ఇక ఇలా క్రికెటర్లు ఏదైనా పోస్ట్ పెట్టారు అంటే చాలు అది నిమిషాల్లో వైరల్ గా మారిపోతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఓ క్రికెటర్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు యష్ దయాల్. తన ఆటతీరుతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.


 అయితే ఈ యంగ్ క్రికెటర్ కాస్త ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు అని చెప్పాలి. ఇటీవల అతని ఇన్స్టాగ్రామ్ లో లవ్ జిహాద్ను ప్రతిబింబించే విధంగా ఒక కార్టూన్ పోస్ట్ అయింది. ఇక ఆ తర్వాత అది పొరపాటున జరిగిందంటూ మరో పోస్ట్ కూడా వచ్చింది. అయితే వెంటనే దీనిపై స్పందించిన యష్ డయాల్ తన అకౌంట్ హ్యాక్ అయిందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది యష్ దయాలకు సపోర్ట్ చేస్తుండగా.. కొంతమంది మాత్రం అతనిపై విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ విషయం ఎక్కడ వరకు దారితీస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: