ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం మాత్రం చిరాకు తెప్పిస్తుంది అని చెప్పాలి. ఆ విషయం ఏదో కాదు స్పామ్ కాల్స్. చాలా కంపెనీలకు చెందిన కాల్స్ ప్రతిరోజు వస్తూ ఉంటాయి. దీంతో స్మార్ట్ఫోన్ వినియోగదారుడికి తనకు కావాల్సిన అవసరమైన కాల్స్ కంటే అనవసరమైన కాల్స్ ప్రతిరోజు ఎక్కువగా వస్తూ ఉంటాయి అని చెప్పాలి. కూడా తమ సర్వీస్ ఎలా ఉంది అని కస్టమర్లను పదేపదే అడిగి తెలుసుకోవడానికి ఎంతో మంది కస్టమర్ కేర్ సిబ్బందిని కూడా నియమించుకుంటుంది.


 దీంతో కస్టమర్లకు ఫోన్ చేసి.. తమ సర్వీస్ గురించి అడగడమే వాళ్ళ పని కాబట్టి అదే పనిని పదేపదే చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ పని సరిగానే జరుగుతున్న.. ఎందుకో ఇలా తరచూ ఫోన్లు వస్తూ ఉండటం మాత్రం కస్టమర్లకు తెగ ఇబ్బందిగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఒకే విషయంపై ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పదికి పైగా కాల్స్ వస్తూ ఉండడంతో కొంతమంది మొబైల్ వినియోగదారులు చిర్రెత్తిపోతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక వినియోగదారునికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. అతను తన బైక్ ని షో రూమ్ లో సర్వీసింగ్ చేసుకున్నాడు. అదే అతని పాలిట పాపంగా మారిపోయింది.


 బైక్ సర్వీసింగ్ చేసుకున్న రోజు నుంచి కాల్స్ మొదలయ్యాయి. మా సర్వీస్ ఎలా ఉంది   బైక్ సర్వీసింగ్ బాగా చేశారా.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మా పైవాళ్లు ఫోన్ చేసిన ఇదే విషయం చెప్పండి అంటూ ఇక ఆ బైక్ షో రూమ్ నుంచి తరచూ కాల్స్ వస్తూనే ఉన్నాయి.  కడపకు చెందిన దిలీప్ అనే వ్యక్తికి కూడా ఒకే నెలలో ఇలాంటి కాల్స్ ఏకంగా నూట ఒకసారి వచ్చింది. అయితే పలు నెంబర్లను బ్లాక్ చేసినప్పటికీ కూడా వేరు వేరు నెంబర్లనుంచి ఫోన్ చేసి వేధించడంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. ఈ క్రమంలోనే అతను పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే వెంటనే స్పందించిన పోలీసులు సదరు కంపెనీ సిబ్బందిని పోలీస్ స్టేషన్కు పిలిపించి మందలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: