
అయితే ఇక మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. టి20 ఫార్మాట్ కు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ వన్డే ఫార్మర్ సారథిగా కేఎల్ రాహుల్ లనూ నియమించింది. టీమ్ ఇండియా ఆడబోయే టెస్ట్ ఫార్మాట్ కి మాత్రం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కి సారధ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే మూడు ఫార్మట్లలో కూడా ప్రొటీస్ జట్టును వారి సొంత గడ్డ మీదే దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది భారత జట్టు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రాక్టీస్ లో కూడా మునిగి తేలుతుంది. ఇలాంటి సమయంలో ఇక సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ప్రారంభం కాకముందే.. టీమ్ ఇండియాకు ఒక ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తోంది.
జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఫేసర్ దీపక్ చాహార్ సౌత్ ఆఫ్రికా టూర్ దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అదేంటి అతను గాయం బారిన పడలేదు కదా ఇంకా ఎందుకు దూరం అవుతున్నాడు అనుకుంటున్నారు కదా.. అయితే దీపక్ చాహార్ తండ్రి లోకేంద్ర సింగ్ చాహార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు చాహర్ దూరంగా ఉండాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన తండ్రి బాగోగులను దగ్గరను చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే అటు ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్ లో కూడా చాహర్ ఆడలేదు అన్న విషయం తెలిసిందే.