ప్రస్తుతమున్న పరిస్థితులలో సామాన్య ప్రజలు కూడా రోడ్ల మీదికి రావాలంటే ఎండలకు భయపడుతున్నారు. అలాంటిది పార్టీ నాయకులు మాత్రం ఈ ఎండలను లెక్కచేయకుండా కేవలం తమ విజయం కోసమే సాయి శక్తుల ప్రయత్నిస్తూ ఉన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఎండల వల్ల అభ్యర్థులకు చాలా గండంగా మారుతోంది. ప్రతి నియోజకవర్గంలోని అభ్యర్థులు గ్రామంలోనికి కచ్చితంగా ప్రచారం చేస్తూ వెళ్లాల్సిందే. ముఖ్యంగా పోలింగ్ సమయం కూడా మరి కొద్ది రోజులలో ఉన్నది.


ఇలాంటి పరిస్థితులలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కి చెందిన టిడిపి అభ్యర్థి బండార శ్రావణి ఒక్క సారి అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది.. ప్రచారంలో భాగంగా అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్న ఈ మహిళా నేత వడదెబ్బ కారణంగా హాస్పిటల్ పాలైనట్లు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె శరీరం మొత్తం డిహైడ్రేషన్ బారిన పడ్డట్టుగా కూడా వైద్యులు వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బండారు శ్రావణి ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉంది.


అయితే ఇలాంటి సమయంలో బండారు శ్రావణి అనారోగ్య బారిన పడటంతో ఒక్కసారిగా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు.. నిన్నటి రోజున ఉదయం వడదెబ్బకు బండారు శ్రావణి గురి కావడంతో తన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన కార్యకర్తలు అభిమానులు సైతం ఆమెను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో కూడా ఎండ వేడి 43 డిగ్రీలకు పైగా కొనసాగుతోంది. ఎలక్షన్ సమయం దగ్గరగా ఉండడంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకొని ప్రచారానికి రావాలని కోరుకుంటున్నారు. శింగనమల నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్థిగా వీరాంజనేయులు పోటీ చేస్తుండగా అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి శైలజా నాద్ కూడా పోటీ చేస్తున్నారు. ఈసారి ఇక్కడ చాలా టఫ్ గా మారే పరిస్థితి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: