ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. ‘మహానటి’ టైటిల్ తో సావిత్రి జీవితం పై తీసిన బయోపిక్ ఘనవిజయం సాధిస్తే నందమూరి తారకరామారావు జీవితం పై తీసిన ‘కథానాయకుడు’ ఫెయిల్ అయింది. అదేవిధంగా తమిళ ప్రజలు అమ్మగా ఆరాధించే జయలలిత జీవితం పై తీసిన ‘తలైవీ’ మూవీ కూడ ఫెయిల్ అయింది.



ఇక క్రీడారంగానికి సంబంధించి సచిన్, ధోని, అజహర్, మేరీ కోమ్, మిథాలీ రాజ్ ల జీవితాల పై తీసిన బయోపిక్స్ కూడ కొన్ని విజయవంతం అయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం పై ఒక బయోపిక్ నిర్మాణం జరుగుతోంది. ఈ మూవీలో ఇళయరాజా గా కోలీవుడ్ ధనుష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులోకి సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం పై తీయబోతున్న బయోపిక్ కూడ చెరబోతోంది.



బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ రజనీకాంత్ జీవితం పై ఒక బయోపిక్ ని తీయడానికి రజనీ అంగీకారం కోసం ఈమధ్య అతడిని చెన్నైలో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. బస్ కండెక్టర్ గా జీవితాన్ని మొదలుపెట్టి ఆతరువాత సినిమాలలోకి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ జీవితంలో ఇప్పటివరకు చాల మందికి తెలియని విషయాలు ఈ బయోపిక్ లో ఉంటాయి అని అంటున్నారు.



అయితే ఒక బయోపిక్ సక్సస్ అవ్వాలి అంటే ఆ బయోపిక్ కు సంబంధించిన సెలెబ్రెటీ జీవితంలో చాల ఆశక్తి కలిగించే అంశాలు ఉండాలి. దీనితో రజనీకాంత్ జేవితంలో అన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. రాజకీయాలలోకి రావాలి అంటూ ఎన్నోసార్లు ప్రయత్నించిన రజనీకాంత్ ఈవిషయంలో తన కోరికను నెరనేర్చుకో లేకపోయాడు. కేవలం రజనీకాంత్ బాలచందర్ కమలహాసన తో అతడి సాన్నిహిత్యం రజనీ భార్య లత గురించి తెలియని విషయాలు ఈ బయోపిక్ లో ఉండే అవాకాశం ఉంది అంటున్నారు. అయితే ఈ బయోపిక్ కు దర్శకుడు ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: