కేవలం తెలుగులోని కాకుండా తమిళ భాషలో సైతం హరీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే  ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించిన  గీతాంజలి సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమా తీసారు శివతుర్ల  దర్శకత్వంలో హారర్ నేపథ్యం లో వచ్చిన ఈ సినిమా అంజలి కెరియర్ లోనే తన 50వ సినిమాగా తెరకెక్కింది. కాగా ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా

 తమిళం కన్నడ మలయాళ భాషల్లో కూడా విడుదల భారీ విజయాన్ని అందుకుంది. అయితే థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి కూడా రాబోతోంది. ప్రీమియర్ హక్కులను పాపులర్ తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ఆహా దక్కించుకుంది. అయితే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా మే 8న ఆహా లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. మరి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాల్సి ఉంది. కగా ఈ సినిమాలో అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ సత్యా శకలక శంకర్

అలీ బ్రహ్మాజీ రవిశంకర్ రాహుల్ మాధవ్ లతోపాటు ఇతర నటీనటి లు  కీలక పాత్రలో కనిపించారు.  ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్‌ తెరకెక్కించారు. కేవలం తెలుగులోని కాకుండా తమిళ భాషలో సైతం హరీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్ అంజలి  ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో రాంచరణ్‌ హీరోగా ఆర్‌సీ 15గా తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. షూటింగ్ దశలో ఉంది. అంజలి మరోవైపు విశ్వక్‌ సేన్‌తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: