ఏపీలో ఎన్నికల పండుగ ఇంకా వారం రోజుల్లో ముగియనుంది. ఇక వారం తర్వాత ఊరు, వాడలు, పట్టణాలన్నీ బోసిపోతాయి. గత మూడు నాలుగు నెలల నుంచి వినిపించిన సౌండ్స్ , నాయకుల స్పీచ్ లు,  ఎంతో సందడిగా సాగినటువంటి ప్రచారాలు కనిపించవు. మన ఇంటికి ప్రతిరోజు వచ్చే నాయకుడు , ఆ తర్వాత మనకెంతో దూరంగా వెళ్ళిపోతాడు. మనం కనీసం కలుద్దామన్న  కలవలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇలా ఏ పార్టీ నుంచి గెలిచిన నాయకుడైన ఆ విధంగానే తయారవుతాడు. ప్రస్తుతం ఏపీలో వైసిపి, టిడిపి, కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఓవైపు టిడిపి, వైసీపీలో నువ్వా నేనా అనే విధంగా ఉన్నాయి. ఇదే తరుణంలో  పార్టీల మేనిఫెస్టోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ మేనిఫెస్టోలో ఉన్న పథకాల గురించి చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నాయకులు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ పార్టీ వారి పాత మేనిఫెస్టోని చూపిస్తూ మేము గెలిస్తే  పథకాలలో కాస్త పెంపు చేసి మళ్లీ అందిస్తామని అంటున్నారు. అంతేకాకుండా టిడిపి ప్రభుత్వం వస్తే మాత్రం ఉన్న పథకాలన్నీ ఆగిపోతాయని ప్రజలంతా రోడ్డుమీదకి వస్తారని ఒక ప్రచార అస్త్రంగా చేసుకొని   జగన్ ముందుకెళ్తున్నారు. అయితే జగన్ మాట్లాడే ఈ మాటలను ప్రజలు నమ్ముతారా అనే విషయానికి వస్తే.. కాదనే చెప్పవచ్చు.

ఎందుకంటే కేసీఆర్ కూడా  ఏకధాటిగా 10 సంవత్సరాలు తెలంగాణను పాలించాడు. ఎన్నో పథకాలు తీసుకువచ్చాడు. అయితే మూడవసారి మాత్రం బోల్తాపడ్డాడు. ఆయన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతే, ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ  స్టాప్ అవుతాయని అన్నారు. కానీ ప్రజలు నమ్మలేదు మార్పు కావాలని కాంగ్రెస్ ని గెలిపించారు. అయితే జగన్ కూడా కేసీఆర్ లాగే నేను ఓడిపోతే పథకాలన్నీ వైసీపీ తీసి వేస్తుందని ఆలోచనలు ప్రజలకు కల్పిస్తున్నారు. కానీ ప్రజలు మార్పు కోరుకుంటే మాత్రం జగన్ పాచికలు పారవు అని తెలుస్తోంది.  ఈ తరుణంలో టిడిపి సరికొత్త పథకాలతో  కొత్తగా ఆకట్టుకుంటుంది. ఈ విధంగా ఏపీలో ప్రచార హోరు మాత్రం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: