తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ అనగానే అందరికీ శ్రీముఖి పేరే గుర్తుకు వస్తుంది. తనదైన యాంకరింగ్ తో శ్రీముఖి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. హీరోయిన్ల రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. వరుస టీవీ షోలు చేస్తూ గత కొన్నేళ్ల నుంచి బుల్లితెరపై స్టార్ యాంకర్ గా బిజీ షెడ్యూల్ ను మెయింటెన్ చేస్తుంది. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై సైతం అలరిస్తోంది. 2012లో వచ్చిన జులాయి మూవీతో శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి సిస్టర్ గా నటించి మెప్పించింది.ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్, చంద్రిక, ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్ర పోరి, నేను శైలజ, సావిత్రితో సహా అనేక చిత్రాల్లో సహాయక పాత్రలను పోషించింది. హీరోయిన్ గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖికి సంబంధించి ఒ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది, ఈ అమ్మడు గతంలో ఓ సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకుందట. ఇటీవల ఇంటర్వ్యూలో శ్రీముఖి ఈ విషయాన్ని స్వయంగా బయట పెట్టింది.

మాస్‌ మహారాజ్‌ రవితేజ, ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ క్రాక్. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ బి మధు నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్, పి రవిశంకర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ సంగీతం అందించాడు. 2021లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు వరుస ఫ్లాపులతో సతమతమైన రవితేజ క్రాక్ మూవీ తో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇకపోతే ఈ చిత్రంలో భూం బద్దాల్.. అంటూ అప్సర రాణి చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే వాస్తవానికి ఈ పాట శ్రీముఖి చేయాల్సిందట. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ ఐటెం సాంగ్ కోసం శ్రీముఖి సంప్రదించాలని మొదట భావించారట. కానీ ఆమె అంతగా ఎక్స్పోజింగ్ చేయదని చాలా మంది గోపీచంద్ మలినేని తో అన్నారట. దాంతో గోపీచంద్ మలినేని శ్రీముఖిని సంప్రదించకుండానే అప్సర రాణిని ఎంపిక చేశారట. అయితే ఓ ఈవెంట్ లో భూం బద్దాల్ సాంగ్ కు శ్రీముఖి డాన్స్ చేసింది.శ్రీముఖి పర్ఫామెన్స్ అనంతరం అదే ఈవెంట్ లో ఉన్న గోపీచంద్ మలినేని ఆమెతో మాట్లాడారట. ఈ సాంగ్ కోసం మొదట నిన్నే తీసుకోవాలని భావించామని జరిగిన విషయాన్ని మొత్తం చెప్పారట. దాంతో క్రాక్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు శ్రీముఖి ఎంతో ఫీల్ అయిందట. తాజా ఇంటర్వ్యూలో శ్రీముఖి ఈ విషయాన్ని అందరితో పంచుకుంది. ఏదైనా భూం బద్దాల్ సాంగ్‌ శ్రీముఖి చేసి ఉంటే మరో లెవెల్ లో ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: