కనీసం ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేని కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికలకు ముందు గొడవలు జరుగుతున్నాయి. తాజాగా అవి తెరమీదికి వచ్చాయి.రాష్ట్రం అంతా కాంగ్రెస్ కి జీరో అంచనాలు ఉన్నాయి. అసలు ఆంధ్రాలో జనాలు ఆ పార్టీని పప్పులో కరివేపాకులా తీసేస్తున్నారు. ఇప్పుడు అసలు అంతో ఇంతో బలంగా పోరాడుతుందని భావించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర గందరగోళం అనేది నెలకొంది.ముందు కొంతమందిని ప్రకటించిన తర్వాత.. ఈమధ్య అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చేశారు. ఇది ఇప్పటికే ప్రకటించిన అభ్యర్తులకు మంటెత్తేలా కూడా చేసింది. దీంతో వారంతా కూడా రెబల్స్‌గా మారడం జరిగింది. కనీసం.. పార్టీకి గౌరవప్రదమైన సీట్లయినా . దక్కితే.. తన హవా కొనసాగుతుందని భావించిన షర్మిలకు ఈ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ నుంచి మొదట బీఆర్ గౌస్ పేరు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. కానీ, రెండు రోజుల క్రితం ప్రకటించిన మూడో జాబితాలో ఒంగోలు అభ్యర్థిగా కొత్తపట్నం మండలానికి చెందిన దాసరి నాగలక్ష్మి ఖరారవ్వడం జరిగింది. దీంతో గౌస్ తీవ్రంగా నిప్పులు చెరుగుతున్నారు. పైగా షర్మిలపైనే విమర్శలు చేస్తున్నారు.కొండేపి సీటును మొదట శ్రీపతి సతీష్ కు ఇచ్చారు. ఆయన కూడా నామినేషన్‌ దాఖలుకు రెడీ అవుతున్న క్రమంలో అనూహ్యంగా దీనిని పసుమర్తి సుధాకర్ కు ఇచ్చారు. దీంతో సతీష్ కోపంతో నిప్పులు చెరుగుతున్నారు. తాను ఖచ్చితంగా పోటీ చేసే తీరుతానని చెబుతున్నారు. కీలకమైన కనిగిరి స్థానాన్ని మొదట కదిరి భవానికి కేటాయించారు.


అందువల్ల ఆమె కుటుంబం ప్రచారంలో దూసుకుపోతోంది. కానీ, ఇప్పుడు ఆమెని కాదని సుబ్బారెడ్డిని ఉంచారు.ఇక కాంగ్రెస్ ఇచ్చిన తొలి జాబితాలో తొలిపేరు మార్కాపురం కావడం గమనార్హం. అయితే ఇక్కడ నుంచి షేక్ సైదాను ప్రకటించగా అతను ఇండియా కూటమి నాయకులతో బీ ఫారంపై నామినేషన్ కూడా వేశారు. ఇప్పుడు మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థిగా సయ్యద్ జావీద్ అన్వర్ ను ప్రకటించడం జరిగింది.దీంతో సైదా ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముందుగానే ప్రకటించిన అభ్యర్థులను కాదని మళ్లీ కొత్త అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేగింది. అంతేగాక షర్మిళ ప్రసంగాలు కూడా లాజిక్ లేకుండా విసుగు పుట్టిస్తున్నాయి. తన అన్న జగన్ ని టార్గెట్ చేస్తూ పాడిన పాటే పాడుతూ ఉండటం జనాలకు విసుగు పుట్టిస్తుంది. పైగా ఆమె మాటలు, వాగ్దానాలు కూడా జనాలకి ఫేక్ గా అనిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఆమెకు బాగా మైనస్ గా మారింది. ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ప్రకారం ఆమెకు డిపాజిట్లు కూడా రావడం కష్టంగా ఉంది. నోటా కంటే కాంగ్రెస్ కి తక్కువ ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని ఇండియా హెరాల్డ్ సర్వే ద్వారా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: