గ్లోబల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ప్రియాంక చోప్రా.. గతంలో ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బాలీవుడ్లో పలు సినిమాలలో నటించేది. అయితే ఆ తర్వాత స్టార్ డం పెరగడంతో హాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ అక్కడ మంచి సినిమాలలో నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ ఇతరత్రా భాషలలో కూడా నటించింది ప్రియాంక చోప్రా అలాగే పలు చిత్రాలను స్పెషల్ సాంగులలో కూడా అలరించింది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా కంటే నిక్ దాదాపుగా 10 సంవత్సరాలు చిన్నవాడు కావడంతో ఈమె పెళ్లి కూడా ఒక పెను దుమారాన్ని సృష్టించింది.


ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. గతంలో కూడా వీరు ఉంటున్న ఒక ఇంటిని కూడా అమ్మేసినట్లు వార్తలు వినిపించాయి.. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ను ఒక అరుదైన వ్యాధి సోకిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది.. దీంతో నిక్ జోనస్ ఆరోగ్యానికి సంబంధించి ప్రియాంక చోప్రా అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు.


నీ జోనస్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేస్తూ తనకు ఇన్ఫ్లు ఎంజా -A తో బాధపడుతున్నట్లుగా తెలియజేశారు. ఈ క్రమంలోనే తాను మ్యూజిక్ షోలు కూడా చేయలేకపోతున్నానంటూ ఈ వీడియోలో వెల్లడించారు. దీంతో అభిమానులకు సైతం క్షమాపణలు కూడా తెలియజేశారు.. తను గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారని అసలు మాట్లాడలేకపోతున్నానని జ్వరం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని కొద్దిరోజులు వైద్యులు తనని రెస్ట్ తీసుకోమన్నారని కూడా ఈ వీడియోలో తెలియజేశారు. తిరిగి ఆగస్టులో అన్ని రీ షెడ్యూల్ చేస్తాను తన ప్రోగ్రామ్స్ అంటూ ఈ వీడియో ద్వారా తెలిపారు నిక్ జోనస్..

మరింత సమాచారం తెలుసుకోండి: