తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యువ నటుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో నితిన్ ఒకరు. ఈయన ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వం లో రూపొందుతున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది . ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "హరిహర వీరమల్లు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుండగా మొదటి భాగాన్ని ఈ సంవత్సరం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

ఒక వేళ నిజం గానే హరిహర వీరమల్లు సినిమాను డిసెంబర్ 20 వ తేదీనే విడుదల చేసినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ తో పవన్ కళ్యాణ్ పోటీ పడవలసి వస్తుంది. మరి నితిన్ , పవన్ కళ్యాణ్ వీరాభిమాని పవన్ సినిమా కూడా అదే తేదీన విడుదల చేస్తే నితిన్ వెనక్కు తగ్గే అవకాశం కూడా ఉంది. మరి హరిహర వీరమల్లు సినిమాను ఏ తేదీన విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: