ఐపీఎల్ 2024 సీజన్ చివరి దశకు చేరుకుంది. దాదాపుగా ప్లే ఆప్స్ కు చేరబోయే జట్లు ఏవి అనే విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇప్పటి వరకు ఈ సీజన్ లో 11 మ్యాచులను ఆడగా అందులో ఎనిమిది మ్యాచ్ లలో గెలుపొంది మూడింట్లో ఓడిపోయి 16 పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు ఈ సీజన్లో 10 మ్యాచ్ లు ఆడగా అందులో ఎనిమిది మ్యాచ్లు గెలిచి రెండిట్లో ఓడిపోయి 16  పాయింట్స్ తో పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్లో 11 మ్యాచులు ఆడగా ఆరింట్లో గెలిచి ఐదు మ్యాచ్లలో ఓడిపోయి 12 పాయింట్లతో 3 వ స్థానంలో కొనసాగుతుంది.


సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు పది మ్యాచులు ఆడగా అందులో ఆరు మ్యాచులలో గెలిచి , నాలుగు మ్యాచ్లలో ఓడిపోయి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. లక్నో జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడి 6 మ్యాచ్ లలో గెలిచి ఐదు మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్లతో అయిదవ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడగా అందులో ఐదు మ్యాచ్ లలో గెలిచి , 6 మ్యాచ్ లలో ఓడిపోయి పది పాయింట్లు ఆరవ స్థానంలో ఉంది. ఇక బెంగళూరు జట్టు 11 మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు గెలిచి ఏడు మ్యాచ్ లలో ఓడిపోయి 8 పాయింట్లతో ఏడవ స్థానంలోనూ , కింగ్స్ 11 పంజాబ్ ఎనిమిది పాయింట్లతో ఎనిమిదవ స్థానంలోనూ , గుజరాత్ జట్టు ఎనిమిది పాయింట్లతో 9వ స్థానంలోనూ , ముంబై జట్టు ఆరు పాయింట్లతో పదవ స్థానంలోనూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl