రవి ప్రకాశ్ తెలుగు ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్నవారు. ఆయన ఒక ప్రముఖ ఛానల్ లో ఉన్నప్పుడు ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. తెలుగులో ఇరవై నాలుగు గంటల పాటు వార్తలు అని తొలి శాటిలైట్ న్యూస్ ఛానల్ ని తెచ్చిన ఘనత ఆయన సొంతం. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులపాటు రాజకీయాలకు బలయ్యారు.  అండర్ గ్రైండ్స్ కి వెళ్లాల్సి వచ్చింది.


కాకపోతే ఆయనకు ఇప్పటకీ టీవీ 9లో వాటాలు ఉన్నాయి. 8 వాతం వరకు మైనర్ వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్ టీవీ పేరుతో డిజిటల్ మీడియా రంగంలోకి అడుగు పెట్టారు. క్రమేపీ డిజిటల్ రంగంలో ఆ ఛానల్ ను విస్తరిస్తున్నారు.  విస్తృత నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొని సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. తనదైన రాజకీయ విశ్లేషణలతో ముందుకు సాగుతున్నారు.


ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనే స్టడీని ప్రకటిస్తున్నారు. ఇవి ప్రజల్లోకి సైతం బలంగా వెళ్తున్నాయి. ఎన్నికల అన్నాక సర్వేలు, స్ట్రాటజీలు కామన్. కానీ వినూత్నంగా రవి ప్రకాశ్ విజేతలను ప్రకటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఫలితాలను ప్రకటించేస్తున్నారు. దీంతో ఈ రిజల్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే రవి ప్రకాశ్ క్రెడిబిలిటీ ఎలా ఉంటుందంటే.. 2004లో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని అనేక సర్వే సంస్థలు, నాయకులు తెలిపారు.


కానీ టీవీ 9 ఛానల్ ద్వారా రవి ప్రకాశ్ ఒక్కరే కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చిచెప్పారు. ఈ సమయంలో టీడీపీ నాయకులు ఆయనపై దుమ్మెత్తి పోశారు. తాము అధికారంలోకి వస్తే టీడీపీని బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. అయినా ఆయన బెదరలేదు. అన్నట్లు గానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 2024లో సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈయన మాత్రం టీడీపీ కూటమి గెలుస్తుందని  ప్రకటించారు. ఇది ఒకలా చెప్పాలంటే తన క్రెడిబిలిటీని ఫణంగా పెట్టి చెప్పినట్లే. ఏది అయితే అది అవుతుందని తెగించి ఫలితాలను ప్రకటించారు. మరి ఈయన అంచనాలు నిజం అవుతాయో.. లేక మరో లగడపాటిలా మారతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: