స్టార్ హీరోయిన్ త్రిష టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ఎన్నో సినిమాలు చేసి స్టార్ డమ్ సంపాదించుకుంది. 20 ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంది.ఆ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పొన్నియన్ సెల్వన్ తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత వచ్చిన లియో సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది.తాజాగా.. త్రిష 41వ పుట్టినరోజు జరుపుకుంది. దీంతో ఆమెకు ఫ్యాన్స్, సెలెబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలిపారు. ఇందులో భాగంగా త్రిషకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి కారణం.. ఆ ఇంటర్వ్యూలో త్రిష చేసిన తలపతి విజయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేయడమే. ఈ వీడియోలో త్రిష విజయ్ గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో అందరూ సరదాగా గడుపుతుంటే.. విజయ్ మాత్రం పక్కకు వెళ్ళిపోయి ఓ మూలన కూర్చుని గంటల తరబడి గోడవైపు చూస్తూ ఉంటారు. సెట్‌లో చాలా సైలెంట్ గా ఉంటాడు. ఎవరితోను పెద్దగా మాట్లాడడు. విజయ్ లో నాకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే అది ఇదే అంటూ.. చెప్పుకొచ్చింది త్రిష.మధ్యలో అడ్డుకున్నాడు విజయ్.విజయ్ మాట్లాడుతూ.. నేను ఆ సీన్ గురించి ఆలోచిస్తాను. వాళ్లంతా కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ నెక్స్ట్ షాట్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి అని ఆలోచిస్తున్నాను. అంతే అంటూ.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.త్రిష స్పందిస్తూ, విజయ్ అందరికితో కలిసిపోయి.. సరదాగా మాట్లాడితే చూడాలనిపిస్తుంది అన్నారు. అందరితో కలవడ.. అదే అతనిలో నాకు నచ్చని విషయం అన్నారు త్రిష.త్రిష కామెంట్స్ కు ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు విజయ్. ఇక వీరికి మరో ప్రశ్న ఎదురయ్యింది. విజయ్-అసిన్, విజయ్-నయనతార, విజయ్-త్రిషలలో బెస్ట్ పెయిర్‌ గా ఎవరిని చెపుతారు అంటూ త్రిషను అడిగారు హోస్ట్. విజయ్‌ని తెరపై కనిపించినప్పుడు బెస్ట్ పెయిర్ ఎవరు అని అడిగినప్పుడు, విజయ్-త్రిష జోడీ బెస్ట్ పెయిర్ అన్నది నిజమేనని అనుకుంటున్నాను. అని అన్నారు.విజయ్ కూడా కలగచేసుకుంటూ.. నాతో చాలా మంది చెప్పారు. మాది బెస్ట్ పెయిర్ అని అన్నారు. ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. శోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను బింబిసారా ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: