లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది.

ఇక ఈ మూవీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాకు కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాను కొన్ని రోజుల క్రితమే జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ సినిమాను జూన్ 17 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం వారు ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఇంతలోనే ఈ సినిమా జూన్ నుండి జూలై కి వెళ్లి పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ని జూన్ నెలలో విడుదల చేయడం వీలుకాదు అనే ఉద్దేశంతో జూలై లో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను జూలై 11 వ తేదీన గాని 17 వ తేదీన గాని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: