- విశాఖ నార్త్‌లో వైసీపీ రాజు Vs బీజేపీ రాజు హెరాహోరీ
- ఎవ‌రో గెలుస్తారో స్ప‌ష్టంగా చెప్ప‌ని స‌ర్వేలు... !
- తొలిసారి గెలుపుకోసం కేకే.. రెండోసారి ఎమ్మెల్యే అవ్వాల‌ని విష్ణు పంతం

( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )

విశాఖ‌లో ఈ సారి ఇంకా చెప్పాలంటే ఫ‌స్ట్ టైం రెండు ప్ర‌ధాన ప‌క్షాల నుంచి క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల మ‌ధ్య అదిరిపోయే ఎన్నిక‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఆ యుద్ధానికి వేదిక కానుంది విశాఖ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం. మామూలుగా క్ష‌త్రియుల‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రాన్ని కాపిట‌ల్ ఆఫ్ క‌త్రియాస్ అని పిలుస్తారు. ఆ ప్రాంతం చుట్టుప‌క్క‌ల క్ష‌త్రియుల డామినేష‌న్ ఎక్కువుగా ఉంటుంద‌ని.. కానీ భీమ‌వ‌రం, ఉండితో స‌రిపోలుస్తూ విశాఖ నార్త్ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఏకంగా 22 వేల మంది క్ష‌త్రియ వ‌ర్గ ఓట‌ర్లు ఉన్నారు. ఓ ర‌కంగా ఇది చాలా ఎక్కువ నెంబ‌ర్ అని చెప్పాలి.


ఇక్క‌డ నుంచి 2014 ఎన్నిక‌ల్లో కూట‌మిలో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2019లో పొత్తు లేక‌పోయినా బీజేపీ ఒంట‌రి పోరులో పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు విజ‌యం సాధిస్తే వైసీపీ నుంచి పోటీ చేసిన కేకే రాజు గ‌ట్టి పోటీ ఇచ్చి కేవ‌లం 1900 ఓట్ల స్వ‌ల్ప తేడాతో గంటాను ఓట‌మి చివ‌రి అంచుల వ‌ర‌కు తీసుకు వెళ్లారు.


కెకె రాజు అంటే ఆయ‌న పూర్తి పేరు క‌మ్మిలి క‌న్న‌ప‌రాజు.. ఆయ‌న స్వ‌స్థ‌లం కాకినాడ జిల్లాలోని జ‌గ్గంపేట‌. వ్యాపారాల నిమిత్తం విశాఖ‌లో సెటిల్ అయ్యి రాజ‌కీయంగా ఎదిగారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడినా కూడా కెకె రాజుకు జ‌గ‌న్ నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చారు. ఆయ‌న పార్టీని న‌మ్ముకుని ఐదేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ఎంతో పోరాటం చేశారు. ఈ రోజు విశాఖ న‌గ‌రంలో లేదా జిల్లాలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల సంగ‌తి ఎలా ఉన్నా కెకె రాజు గెలుస్తాడు అన్న చ‌ర్చ ఎక్కువుగా న‌డుస్తోందంటే అందుకు ఆయ‌న ప‌డిన వ్య‌క్తి గ‌త క‌ష్టంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేసిన తీరుకు త‌ప్ప‌క మెచ్చుకోవాలి.


పొత్తులో భాగంగా కూట‌మి త‌ర‌పున మ‌రోసారి నార్త్ నుంచి పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ సారి గెలిచేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. అటు వైపు క్ష‌త్రియుడే పోటీలో ఉండ‌డం.. ఐదేళ్ల పాటు ప్ర‌జ‌ల‌ను అంటిపెట్టుకుని ఉండ‌డంతో ఈ సారి విష్ణు గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. అయితే కూట‌మి ప్ర‌భావం గ‌ట్టిగా ఉండ‌డం, జ‌న‌సేన , టీడీపీ ఓట్లు క‌లిసి వ‌స్తుండ‌డంతో విష్ణు గెలుపుపై చాలా ధీమాతో ఉన్నారు. మ‌రి ఇద్ద‌రు రాజుల భీక‌ర యుద్ధంలో ఏ రాజుని విజ‌యం వ‌రిస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: