ఏపీ ఎన్నికలు ఈసారి చాలా జోరుగా సాగుతున్నాయి.  వైసిపి, టిడిపి, కాంగ్రెస్  అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే తరుణంలో  మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో  అభ్యర్థులంతా  నేను గెలుస్తాను అంటే నేను గెలుస్తాను అంటూ ధీమాతో ఉన్నారు. ఇద్దరు పోటీ పడ్డప్పుడు ఇద్దరు గెలవలేరు ఎవరో ఒకరు మాత్రమే గెలవాలి. ఆ విధంగా వైసిపి, టిడిపి పోరులో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని పార్టీలు గెలుస్తాయని అంచనా వేస్తూ ఉంటారు. 

పోయిన ఎలక్షన్స్ ఇంకా వారం పది రోజులు ఉన్నది అనగా టిడిపిపై ఉన్న వ్యతిరేకత తీవ్రంగా కనిపించింది. వైసిపి విజయం సాధిస్తుందని చాలామంది భావించారు. కానీ వైసీపీ  151సీట్లు సంపాదిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ విధంగా ఘనవిజయం సాధించిన జగన్ సర్కార్  ఎన్నో అభివృద్ధి పనులు తీసుకువచ్చింది. కానీ ఆ  పనులు మాత్రం ఆ పార్టీకి చెందిన వ్యక్తులకే ఎక్కువగా జరిగాయని, గ్రామాల్లో వైసీపీ నాయకుల డామినేషన్ చేస్తూ వచ్చారని ఒక అపోహ ప్రజల్లో ఉంది. అంతేకాకుండా  ప్రభుత్వ పథకాలు గ్రామాల్లో కొంతమందికి మాత్రమే అందాయని  అలా అందిన వాళ్లు మాత్రమే వైసిపి వైపు చూసే అవకాశం ఉందని, మిగతా వాళ్లంతా టిడిపి వైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా జగన్ ఐదు సంవత్సరాల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది  మరి ఎక్కువ స్థాయిలో పెరిగిపోయింది.

 అంతేకాకుండా  ఇంతకుముందు ఏనాడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఇంతలా ఉపయోగించుకోలేదు. ఈ ఏడాది మాత్రం పోటీపడి మరి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారట ఉద్యోగులు.  వీళ్లను చూస్తే మాత్రం ప్రభుత్వంపై తీవ్ర కషితో ఉన్నారని  అర్థమవుతుంది. అలాగే పోయిన ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేసింది. దీనివల్ల టిడిపికి పడే కొన్ని ఓట్లు జనసేన పార్టీకి పడడం అప్పుడు మైనస్ గా మారింది. ఈసారి జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఆ ఓట్లు కూడా టిడిపి వైపే పడతాయి. ఈ  ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే మాట వన్ సైడ్ వినిపిస్తోంది. కానీ జనాలు బయటకు చెప్పడం లేదు. సైలెంట్ గా వన్ సైడ్ ఓటింగ్ జరిగి టిడిపి గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: