సాధారణంగా ప్రజలకు సమస్యలు వస్తే అధికారులు ఉన్నారు అని తమ సమస్యను పరిష్కరించుకోవడానికి అధికారుల దగ్గరకు వెళ్తూ ఉంటారు ప్రజలు.. అలాంటిది అధికారులకే సమస్యలు వస్తే ఇక దిక్కు ఎవరు అంటూ ప్రముఖ ఐఏఎస్ డాక్టర్ పి.వి. రమేష్ ప్రశ్నిస్తున్నారు.. గత 36 సంవత్సరాలుగా ఐఏఎస్ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈయన గత కొన్ని రోజులుగా ఈ ప్రభుత్వంతో ఇబ్బంది పడుతున్నాను అంటూ ఎక్స్ ద్వారా తాను ఎదుర్కొంటున్న  సమస్యను  షేర్ చేసుకున్నారు.

ఇక అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన భూ హక్కు చట్టంపై ఈయన మాట్లాడుతూ.. తనకు ఎదురైన సమస్యను వెల్లడించారు.. నేను ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తిని.. భూ హక్కు చట్టం  కింద అన్యాయం జరుగుతున్న వారిలో తాను ప్రత్యక్ష బాధితుడిని అని చెప్పుకొచ్చారు.. కృష్ణాజిల్లా విన్నకోట గ్రామంలో నా తల్లిదండ్రులు చనిపోయారు.. వారి పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు నేను రెవెన్యూ అధికారుల చుట్టూ ఎంతగానో తిరిగాను..  కానీ వారు నిరాకరించారు.. తహశీల్దార్ కూడా నా  దరఖాస్తును తిరస్కరించారు . ఆర్డిఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు.. నా తల్లిదండ్రుల భూముల పై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు.. ఒక ఐఏఎస్ అధికారిగా దాదాపు 36 సంవత్సరాలు పాటు ఆంధ్ర ప్రదేశ్కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేము అంటూ బాధితుడిగా తాను తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు..

ఇకపోతే వైసీపీ ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ భూ హక్కు చట్టం కింద ఎవరు రైతులు నష్టపోకుండా ఎవరి భూమి వారికే చెందేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు .. కానీ ఏ రోజు కూడా రైతులకు ఉపయోగపడిన దాఖలాలు లేవు.. పైగా ఐఏఎస్ అధికారుల భూములకే దిక్కు దివానా లేకపోతే మరి సామాన్య రైతుల పరిస్థితి ఏంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.. అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రజలు ,రైతులు,  అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అప్రమత్తమవుతున్నారు ..భూ హక్కు చట్టం కింద తమ భూమిని తాము సొంతం చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరి వైసీపీ ప్రభుత్వంలో తాను పడ్డ కష్టాలను చెప్పిన ఐఏఎస్ అధికారికి అండగా రైతులు నిలుస్తున్నారు.


ఇదే కాదు మరొక సమస్యను కూడా తెరపైకి తీసుకొస్తూ ఎక్స్ ద్వారా షేర్ చేయడం జరిగింది.. మరొకవైపు సెప్టెంబర్ 2022లో TRO (టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) పోస్ట్ కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో గొడవ జరగకుండా ఆఫీసర్ స్థాయి వాళ్ళు మాత్రమే టిఆర్ఓ గా ఉంటారని పెట్టారు అయితే ఆ ఏడాది తర్వాత సైలెంట్ గా "ఎనీ పర్సన్" అని దారిన పోయే ఎవరైనా టిఆర్ఓగా చేయచ్చని మార్చేశారు.ఇక్కడ కొసమెరుపు ఏంటంటే బాబు  అరెస్ట్ ఐన టైంలో అందరి దృష్టి అటువైపు ఉండగా మార్చేసారు.. ఈ విషయం తెలిసి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: