ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలది ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఓవైపు ఎండ వేడి విపరీతంగా ఉందంటే  ఈ రాజకీయాల వేడితో మరింత ఉక్కపోత వస్తోంది.. ఇక నాయకులైతే వారి ప్రచార శైలిని మరింత స్పీడ్ చేశారు. ఇక అధినాయకులు మూడు సభలు, ఆరు ప్రసంగాలతో దూసుకుపోతున్నారు. ఇదే తరుణంలో  గులాబీ బాస్ నరేంద్ర మోడీ రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని తన ప్రసంగాన్ని వినిపించారు. కానీ ఆయన మాటల్లో జగన్ ను అంతగా  టార్గెట్ చేసినట్టు ఏమీ కనిపించలేదు.  కూటమి తరపున మోడీ రాష్ట్రానికి వస్తున్నాడు  అంటే ప్రజలంతా జగన్ పై  ఎలాంటి విమర్శలు చేస్తారో అనుకున్నారు.

  కానీ నరేంద్ర మోడీ అంత స్పెషల్ గా జగన్ ను టార్గెట్ చేసినట్టు అయితే కనిపించడం లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ గురించి మాత్రమే మాట్లాడారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ ఏపీ ప్రజలు జగన్ కు ఐదు సంవత్సరాలు  పాలించే అధికారం ఇచ్చారు. కానీ ఆయన రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి లేదని,  అవినీతి ఎక్కువగా జరిగిందని, లిక్కర్, ఇసుక  రాయుళ్లు పెట్రేగిపోయారని అన్నారు. మరి ముఖ్యంగా మూడు రాజధానులు ఏర్పాటు విషయంలో  జగన్ తప్పటడుగు వేశారని, మూడు కాదు కదా ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. ఇలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రతిరోజు ఎలాంటి విమర్శలు చేస్తారో మోడీ కూడా  అలాంటి విమర్శలే చేశారు. ఆయన విమర్శల్లో కొత్తదనం, కొత్త ఊపు ఏమీ కనిపించలేదు.

ఇక జగన్ ను వదిలేసి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు. కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని, దేశంలో ఎలక్షన్ ఎక్కడ జరుగుతున్న ప్రతి చోట ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందన్నారు మోడీ. ఇక మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం మొదలవుతుందని తెలియజేశారు.  అయితే ప్రధాని మోడీ కూటమి తరపున వచ్చినటువంటి రెండవ బహిరంగ సభ ఇది. ఇంతకుముందు చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా జగన్ పై పెద్దగా విమర్శలు ఏమీ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే మాత్రం మోడీ రెండు పడవల మీద కాళ్లు వేసి ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. మోడీ కూటమితో పొత్తు పెట్టుకున్నా కానీ జగన్ పై విమర్శలు చేయడం లేదంటే జగన్ అంటే మోడీకి ఎక్కడో కొంత ప్రేమ కలిగి ఉందని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: