నేటి కాలంలో మారిన మన జీవన విధానం ఇంకా అలాగే ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అయితే ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఒత్తిడి, ఆందోళన, కోపం, చిరాకు వంటివి లేకుండా ఉండాలి. ఎప్పుడు మంచిగా ఆలోచించాలి.ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం వల్ల హార్మోన్లు చక్కగా ఉత్పత్తి అవుతాయి. దీంతో మన శరీరం సక్రమంగా పని చేసి ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాము.అలాగే ఖచ్చితంగా మర్చిపోకుండా రోజూ వ్యాయామం చేయాలి. సూర్య నమస్కారాలు, వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. శరీరంలో వ్యర్థాలు బయటకు పోతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే విధంగా రోజూ రెండు నుండి మూడు సార్లు మలవిసర్జన అయ్యేలా చూసుకోవాలి. రెండు నుండి రెండున్నర లీటర్ల మూత్రవిసర్జన చేయాలి. దాదాపు లీటరు మోతాదులో చెమట బయటకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శరీరం పరిశుభ్రంగా ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల లోపు ఆహారాన్ని తీసుకుని శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి.


 కడుపు నిండా తిని నిద్రపోతే పొట్టకు విశ్రాంతి ఉండదు.కనుక శరీరంలో పూర్తి అవయవాలకు విశ్రాంతి ఇవ్వాలంటే సాయంత్రం భోజనాన్ని త్వరగా చేసేసి నిద్రపోవడం వల్ల శరీరానికి పూర్తి విశ్రాంతి లభిస్తుంది.ప్రతి రోజూ పావు గంట నుండి అరగంట పాటు ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజూ 4 లీటర్ల నీటిని తాగాలి.  ఇలా నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అదే విధంగా పోషకాలు కలిగిన ఆహారాన్నే ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, నూనెలు తగ్గించి తీసుకోవాలి. 60 నుండి 70 శాతం ఉడికించిన ఆహారాలు కాకుండా సహజ ఆహారాలను తీసుకోవాలి. అంటే తాజాగా ఉండే పండ్లు, పచ్చి కూరగాయల జ్యూస్ అలాంటివి.మధ్య వయసులోనే రోగాల బారిన పడకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా బ్రతికినన్ని రోజులు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలను తప్పకుండా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నియమాలను సరిగ్గా క్రమం తప్పకుండా పాటించినప్పుడే మనం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించగలుగుతాము.

మరింత సమాచారం తెలుసుకోండి: