టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో విజయాలను అందుకొని తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇకపోతే పవన్ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. దానితో పవన్ ప్రస్తుతం ఒక వైపు రాజకీయ పనులను చూసుకుంటూనే , మరో వైపు సినిమాలు కూడా చేస్తూ వస్తున్నాడు.

ఇక మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా పోటీలో దిగింది. ఇక ప్రస్తుతం పవన్ రాజకీయ పనులతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా పవన్ ఇంటర్వ్యూ లో తను ఎందుకు ఏ కంపెనీ యాడ్ లలో నటించడం లేదు , అలాగే ఎన్నో భారీ ఆఫర్ లు వచ్చిన వాటిని ఎందుకు వదులుకున్నాను అనే విషయాల గురించి క్లియర్ గా చెప్పుకొచ్చాడు.

తాజాగా పవన్ మాట్లాడుతూ ... నేను చాలా సంవత్సరాల క్రితం కోలా కంపెనీకి ఓ యాడ్ చేశాను. ఆ తర్వాత ఆ కంపెనీ వారు ఆ యాడ్ ను అలాగే కంటిన్యూ చేయమని అన్నారు. కానీ నేను చేయను అన్నాను. చేస్తే మీకు షారుఖ్ కన్నా ఎక్కువ ఇస్తాము అని వారు ఆఫర్ చేశారు. కాకపోతే నేను కొన్ని విలువలు పెట్టుకున్నాను. వాటి ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించాలి అనుకున్నాను. అందుకే నా మనసుకు నచ్చక ఆ రోజు అంత ఆఫర్ చేసిన యాడ్ చేయలేదు అని పవన్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: