ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కీలక ప్రసంగం చేశారు.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ సర్కార్ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఎద్దేవా చేశారు.. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని.. ఏపీకి మోడీ గ్యారెంటీ ఇస్తున్నారని స్పష్టం చేశారు.. బాబూ నాయకత్వం, పవన్ విశ్వాసం అవసరం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.. ఇక ఈ ప్రజా గళం సభా వేదిక పైన వైసీపీ అవినీతి బాట పట్టింది అంటూ ఆరోపణలు చేశారు..

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ కి  ఇప్పటికి రాజధాని నిర్ణయించకపోవడానికి గల కారణం కూడా ఉందని అందుకే ఆ కారణం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అందలేదని తెలిపారు.. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణకు హైదరాబాద్ రాజధాని కాగా.. ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల విషయం తెరపైకి వచ్చింది.. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ తెరపైకి తీసుకొచ్చారు.. కానీ అమరావతి ప్రజలు మాత్రం దీనికి అంగీకరించలేదు.. పైగా నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోవడం నిజంగా విషాదకరం అని చెప్పవచ్చు..

ఈ క్రమంలోనే తాజాగా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. వైసిపికి అవినీతి నిర్వహణ తప్ప రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదని చెప్పిన మోదీ.. రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసిందని తెలిపారు.. అంతేకాదు రాజధాని నిర్మాణానికి కేంద్రం 15 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని భావించింది.. కానీ అవినీతికి పాల్పడ్డ వైసిపి ప్రభుత్వానికి ఇంత డబ్బు ఇస్తే ఖచ్చితంగా లూటీ చేస్తుందని ఆలోచనతోనే ఆ డబ్బు ఇవ్వలేదని నరేంద్ర మోదీ కామెంట్ చేశారు.. ముఖ్యంగా ఈ కారణం వల్లే కేంద్ర నిధులను వైసీపీ సర్కార్ అందుకోలేకపోయిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: