శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రూపొందిన లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన రానా మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు . ఇక ఆ తర్వాత ఈయన కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తం గా గుర్తింపును సంపాదించుకున్నారు . అలాగే కేవలం సినిమాల్లో హీరో గా మాత్రమే నటించాలి అనే ఉద్దేశం లేకుండా ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ గా ఉండడం తో రానా ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాల్లో , అనేక పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

కొంత కాలం క్రితం రానా , రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన బాహుబలి సినిమాలో భల్లాల దేవా అనే పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఈయన తన నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాడు . ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడంతో ఈ మూవీ ద్వారా రానా క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింత పెరిగింది.

ఇకపోతే తాజాగా రానా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు . తాజా ఇంటర్వ్యూ లో బాగంగా రానా మాట్లాడుతూ ... ప్రభాస్ ఇంతసేపు మాట్లాడడు. 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళి పోతాడు . గొప్ప పనులు చేయడానికి ఇష్టపడతాడు. సింపుల్ గా ... హంబుల్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటాడు అని అన్నారు. ఇక ప్రభాస్ గురించి రానా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: