ఈ సంవత్సరం ప్రారంభం అయ్యే ఇప్పటికే నాలుగు నెలలు పూర్తి అయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం అనేక సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టాయి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన హనుమాన్ సినిమా అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. తేజ సజ్జ హీరోగా రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి 200 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది.

అలాగే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను రాబట్టింది. ఇక ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలక్షన్ లనే రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ మూవీ తర్వాత మంచి కలెక్షన్ లను రాబట్టిన సినిమా టిల్లు స్క్వేర్ మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా మంచి కలక్షన్ లను వసూలు చేసింది.

కాకపోతే భారీ స్థాయి కలెక్షన్ లను ఈ మూవీ వసూలు చేయలేదు. ఇకపోతే ఈ సంవత్సరం రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి మూవీ విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ నే ఈ సంవత్సరం భారీ కలక్షన్ లను వసూలు చేసిన హనుమాన్ , గుంటూరు కారం , టిల్లు స్క్వేర్ కలెక్షన్ లను బీట్ చేసే అవకాశం ఉంది అని జనాలు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: