జగపతి బాబు హీరోగా రూపొందిన పెళ్లయిన కొత్తలో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది ప్రియమణి. ఈ మూవీ లో ఈమె తన నటనతో , అంతకుమించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. దానితో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు వరుసగా వచ్చాయి. ఈ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించింది. 

మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈమె క్రేజ్ తెలుగులో మరింతగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు తో పాటు ఇతర ఇండస్ట్రీలో నుండి కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె తెలుగు తో పాటు అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఫుల్ జోష్ లో చాలా సంవత్సరాలు కెరియర్ ను ముందుకు సాగించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. 

కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో భారీగా అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన అందాలను భారీగా ఆరబోస్తుంది. అలాగే అప్పుడప్పుడు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ప్రియమణి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని సిల్వర్ కలర్ బ్లౌజ్ ను ధరించి కంటే చూపులతో కవ్విస్తున్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: