మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని భావన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె తెలుగు లో ఎక్కువ సినిమాలు చేయకపోయినప్పటికీ తక్కువ సినిమాల తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది . గోపీ చంద్ హీరో గా రూపొందిన ఒంటరి మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . ఆ తర్వాత ఈ బ్యూటీ శ్రీకాంత్ హీరో గా కృష్ణ వంశీ దర్శకత్వం లో రూపొందిన మహాత్మా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మూవీ శ్రీకాంత్ కెరీర్ లో 100 వ మూవీ గా రూపొందడంతో మంచి అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది . ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో భావన తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . ఈ రెండు మూవీ లతోనే ఈమె తెలుగు లో బాగా  క్రేజ్ ను సంపాదించుకుంది . ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాల కంటే కూడా ఇతర భాష సినిమాలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపించింది. ఇకపోతే ప్రస్తుతం పరవాలేదు అనే స్థాయి ఉన్న సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. 

అందులో భాగంగా ఈమె మాట్లాడుతూ ... నేను కొన్ని సార్లు అబార్షన్ చేయించుకున్నాను అని కొంత మంది ప్రచారం చేశారు. అలాగే చనిపోయానని కూడా కొందరు మాట్లాడారు. దీంతో చాలా మెంటల్ గా ఇబ్బంది పడ్డా. వాటిని గుర్తు చేసుకుంటే చిరాకు వేస్తోంది. కాకపోతే అలాంటి మాటలను అన్నింటినీ తట్టుకొని నిలబడ్డాను. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను అని ఈమె పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: