సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న రష్మిక మందాన నార్త్ మీద కూడా కన్నేసింది. గుడ్ బై మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.అమితాబ్ మరో ప్రధాన పాత్ర చేసిన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా నటించిన మిషన్ మజ్ను సైతం నిరాశపరిచింది. దాంతో రష్మిక మందాన బాలీవుడ్ ఆశలు గల్లంతు అనుకున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ ఆమెకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. గత ఏడాది రన్బీర్ కపూర్ కి జంటగా నటించిన యానిమల్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది.యానిమల్ వరల్డ్ వైడ్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం అనేక విమర్శల పాలైనప్పటికీ ప్రేక్షకులు ఆదరించారు. కాగా బాలీవుడ్ లో ఎదగాలనే క్రమంలో రష్మిక అక్కడి హీరోయిన్స్ పద్ధతులు పాటిస్తుంది. సినిమా ఈవెంట్స్ లో కురచ దుస్తుల్లో దర్శనం ఇస్తుంది. గతంలో రష్మిక మందాన ధరించిన ఓ డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ ఈవెంట్ కి హాజరైన రష్మిక బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ షార్ట్ డ్రెస్ లో కనిపించింది.మోకాళ్ళకు జానెడు పై వరకు ఉన్న ఆ డ్రెస్ లో రష్మిక చాలా హాట్ గా ఉంది. కురచ డ్రెస్ మరింత పైపైకి పోతుంటే సర్దుకోలేక ఇబ్బంది పడింది. ఫోటోగ్రాఫర్స్ మాత్రం ఆమెను కెమెరాల్లో బంధించేందుకు ఎగబడ్డారు. రష్మిక ఓల్డ్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక రష్మిక కెరీర్ పరిశీలిస్తే… ఆమె చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. పుష్ప 2లో మరోసారి శ్రీవల్లిగా ఆమె సందడి చేయనుంది. పుష్ప 2పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి.అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఫస్ట్ సాంగ్ పుష్ప పుష్ప ఓ రేంజ్ లో ఆదరణ పొందింది. పుష్పతో పాటు రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. గర్ల్ ఫ్రెండ్, రైన్ బో టైటిల్స్ తో ఇవి తెరకెక్కుతున్నాయి. మరోవైపు హీరో విజయ్ దేవరకొండతో ఆమె ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: