భారత్ క్రికెట్ రింకు సింగ్ బ్యాచిలర్ లైఫ్ ను విడి ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టే సమయం దగ్గర పడుతోంది. నమాజ్ వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ని వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ 18న వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 8వ తేదీన నిశ్చితార్థం జరగబోతుందని ఈ వేడుక లక్నోలోని ఒక ప్రముఖ హోటల్లో జరగబోతున్నట్లు సమాచారం. ఇక రింకు సింగ్ చేసుకోబోయే ప్రియా సరోజ్ వయసు 26వ సంవత్సరాలు.


ప్రియా సరోజ్ 2024 లోక్ సభ ఎన్నికలలో నమాజ్ వాది పార్టీ ఎంపీగా గెలిచింది. ప్రియా విద్యాభ్యాసాన్ని మొత్తం కూడా ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో పూర్తి చేసిందట. ఆ తర్వాత నోయిడాలో విశ్వవిద్యాలయం నుంచి పట్టా కూడా పొందినట్లు తెలుస్తోంది. ప్రియా సింగ్ తండ్రి కూడా మూడుసార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారట. ప్రియా సరోజ్ భారతదేశం లోనే అతి చిన్న వయసులోనే మహిళా ఎంపీగా పేరు సంపాదించింది. ఇక రింకు సింగ్ విషయానికి వస్తే.. 1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్లో జన్మించారు.


రింకు సింగ్ తండ్రి సిలిండర్ డెలివరీ బాయ్ గా పని చేసేవారట. రింకు సింగ్ సోదరులు 5 మంది ,ఒక సోదరి కూడా ఉన్నారు. రింకు సింగ్ 9 వ తరగతి ఫెయిల్ అయ్యారు. ఉత్తరకాండ  అండర్-16 లో జరిగే రంజీ మ్యాచ్ కి ఎంపిక అవడంతో 2017లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చారు. అలా షారుఖ్ ఖాన్ KKR అతని 80 లక్షలకు కొనుగోలు చేసింది. అలా కొన్న తర్వాత తన ఆటతీరుతో ఒక్క మ్యాచ్ లోనే 5 సిక్సులు కొట్టడంతో బాగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత  ఇప్పుడు ఇండియన్ టీమ్ తరఫు నుంచి t20 లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు మూడు అర్థ సెంచరీలు సాధించారు. 33 t20 మ్యాచ్ లు ఆడగా 546 పరుగులు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: