మన మొబైల్ నెంబర్ ఇతరులకు కనిపించకుండా మనం ఫోన్ కాల్స్ చేయవచ్చు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అంటే మన ఫోన్ నెంబర్ ఎవరైనా కాల్ చేస్తే వారి నెంబరు కనిపిస్తుంది. అదే మనం ఎవరికైనా కాల్ చేస్తే వాళ్లకు మన నెంబర్ కనిపించదు.. అయినప్పటికీ కూడా ఫోన్ మాట్లాడవచ్చు. ఒకవేళ అవతలి వ్యక్తులు మీ నెంబర్ కు కాల్ చేసిన ఇన్వాల్వ్డ్ అని వస్తుంది. ఎలా చేస్తారో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


మొదట మనం స్మార్ట్ మొబైల్ లో ప్లే స్టోర్ నుంచి టెక్స్ట్ మీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అయితే మొబైల్ లో ఒక సిమ్ము మాత్రమే ఉండేలా చూసుకోవాలి యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత సైన్ అప్ కోసం వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎవరికైతే మీ నెంబర్ కనిపించకూడదని అనుకుంటున్నారో వారి నెంబర్ను ఎంటర్ చేయాలి. అయితే అందుకు కొంత ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాప్ సర్వీసులు ఉచితం కాదు అందుకు కాస్త రుసుము కూడా చెల్లించే ఈ యాప్లు వినియోగించుకోవచ్చట. కొన్ని సందర్భాలలో మాత్రమే ఉచితంగా ఈ యాప్స్ ను వినియోగించవచ్చని తెలుస్తోంది.

అయితే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసేందుకు మీకు కొన్ని క్రెడిట్ పాయింట్ లు కూడా వస్తాయి.ఈ క్రెడిట్ పాయింట్ల సహాయంతో మీరు ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. అప్పుడు మీ నెంబర్ ఇతరుల మొబైల్ లో కనిపించదు అయితే ఇది లిమిటెడ్ మాత్రమే ఉంటుంది ఈ యాప్ నుంచి కాల్ బ్యాక్ చేయడానికి కింద డైలాగ్ ప్యాడ్ ఉంటుంది దానిపై ఏదైనా నెంబర్ కి కాల్ చేస్తే మీరు అవతలి వ్యక్తికి మీ మొబైల్ నెంబర్ కనిపించదు.అలాగే మీ నెంబర్ విజువల్ కాకుండానే ఎవరైనా మెసేజ్లను కూడా పంపించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: