బిగ్ బాస్ సీజన్-5 తో భారీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంది సిరి. దీంతో ఈమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.. ఇక ఈమెతో పాటు సీమటపాకాయ్ సిరి హనుమంతుతో కూడా సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ నుంచి బౌన్స్ బ్యాక్ అంటూ తెలియజేసింది సిరి.. తన బిగ్ బాస్ మిత్రుడు అయినటువంటి షణ్ముఖ్, సిరి టార్చర్ ల మధ్య నలిగిపోయిన జెస్సీతో కలిసి తాజాగా సందడి చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ పై తెగ హాట్ టాపిక్ గా మారుతోంది. దాని గురించి పూర్తి వివరాలు చూద్దాం.


సిరి ఆ వీడియో డబ్బింగ్ లో మాట్లాడుతూ.."నువ్వు కాల్ చేస్తే నేను క్యాన్సిల్ చేసే పొజిషన్ నుంచి.. నేను కాల్ చేసినా కూడా బిజీ వచ్చేంతకు వచ్చినప్పుడే.. నువ్వు ఎవర్నో గోకు తున్నావని తెలియజేసింది.. అంతేకాకుండా నేను నీకు దొరకడం నీ అదృష్టం అయితే.. నువ్వు వేరొకరిని తగులుకోవడం నా అదృష్టం అని తెలియజేసింది.. అయితే ఈ పర్ఫార్మెన్స్ ని సిరి జెస్సీలు ఇరగదీసే సారని చెప్పవచ్చు. ఇక ఈ వీడియోని అలా షేర్ చేశారు లేదు కొన్ని సెకన్లలోనే కామెంట్ల మోతతో మోత మోగిందట.

ప్రజెంట్ సిచ్యు వేషన్ ను బట్టి.. పర్ఫెక్ట్ డైలాగ్ ఎంచుకుంది సిరి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.. మరికొందరు షణ్ముఖ్ ని  ట్యాగ్ చేయడం మొదలు పెట్టేశారు. ఇక మరికొంతమంది అయితే జెస్సీ ని పాపం ఇక్కడ కూడా వదలలేదు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా సిరి-షణ్ముఖ్ మధ్య నలిగిపోయాడు.. ఇంతకీ ఇలాంటి వీడియో కి షణ్ముఖ్ లైక్ కొడతాడా లేదా అనే విధంగా కామెంట్ చేయడం జరుగుతోంది. అయితే ఇలాంటి విషయంలో కి దీప్తి- సునయన కూడా లాగినట్టుగా తెలుస్తోంది నెటిజన్స్.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో ట్రెండీ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: