బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సందడి మొత్తం సిరి, షన్ను లదే అన్నట్టుగా ఉన్న విషయం తెలిసిందే. వీరి హగ్ లు , శృతిమించిన డైలాగ్ లు ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బంది పెట్టిన మాట కూడా నిజమే. అయితే షో నుండి బయటకు వచ్చాక ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. అయితే వీరిపై వస్తున్న కామెంట్లు మాత్రం ఆగలేదు. వీరి వ్యవహారం చూసిన దీప్తి సునైన , శ్రీహాన్ లు బాగా హార్ట్ అయ్యారని బ్రేక్ అప్ లు కూడా జరగాయని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత రవి సర్ది చెప్పడంతో శ్రీహన్ , సిరి లు ఒకటయ్యారు. కానీ షణ్ముఖ్, దీప్తి ల బ్రేకప్ మాత్రం అలాగే ఉంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికపై షన్ను, దీప్తి లు తాము విడిపోయినట్లు ప్రకటించారు. దాంతో  ఫ్యాన్స్  వీరు విడిపోవడానికి కారణం సిరి అంటూ ఆమెను సోషల్ మీడియా వేదికపై ఓ రేంజ్ లో విమర్శిస్తూ ఆడేసుకున్నారు. కాగా తాజాగా సిరి నే కారణం అంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకు దీప్తి సునయన కి మధ్య బ్రేకప్ కి కారణం సిరి ఏమాత్రం కాదని, అందుకు వేరే కారణాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. నేను సిరి మంచి ఫ్రెండ్స్ అనే విషయం దీప్తి సునైనా కూడా పూర్తిగా అర్థం చేసుకుంది, అలాగే మాకు సపోర్ట్ చేసింది.

అయితే కొన్ని కారణాల వలన మేము విడిపోవాల్సి వచ్చిందే తప్ప, అందుకు సిరి మాత్రం కారణం కాదు. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో మేం క్లోజ్ గా ఉన్నాం, దాంతో చాలా మందికి అది నచ్చలేదు అదే విధంగా దీప్తి ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా నచ్చలేదు. ఒకవేళ వారు ఏమైనా దీప్తిపై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు కానీ, దీప్తి సునైనా మాత్రం మమ్మల్ని అర్థం చేసుకోలేదు. కానీ నేను సిరి మాత్రం మంచి స్నేహితులు మా మనసులో ఉన్నది అదే. అదే విధంగా సిరి కూడా నన్ను ఒక మంచి స్నేహితుడు లాగే చూసింది. ఇక నేను దీప్తి సునైనా కలుస్తావా లేదా అన్నది ఆ దేవుడికే తెలియాలి. కాలం మన చేతిలో లేదు నా జీవితంలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.

మరింత సమాచారం తెలుసుకోండి: