
అయితే నాగార్జున వేసుకునే డ్రెస్సుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈయన వేసుకునే షర్ట్స్ అన్నీ కూడా లక్షల్లోనే ఉంటాయట. అంతేకాదు అవి టాప్ బ్రాండ్ షర్ట్స్ అంటూ కూడా ఒక వీడియో అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయిన..Louis, Vuitton, Gucci, Fendi, Off White, Prada వంటి పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించిన షర్ట్స్ ఆయన ధరిస్తున్నారు ప్రస్తుతం వీటి ఒక్కొక్కటి విలువ రూ.75 వేల నుండి రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చాలా వైరల్ గా మారింది.
దీంతో ఎక్కడైనా సరే మన్మధుడి స్టైలే వేరబ్బా అంటూ నాగ్ అభిమానులే కాదు.. నాగ్ వేసే షర్ట్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వడమే కాదు ఆ ధరలు చూసి షాక్ అవుతున్నారు . ఏది ఏమైనా నాగార్జున ఇలాంటి ఖరీదైన ట్రెండీ వేర్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున బుల్లితెరపై పలు షో లు చేస్తూనే మరొకవైపు వెండితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన త్వరలోనే మరో అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.