
హీరో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్త హీరో విరాట్ కర్ణా తో ఈ సినిమా రాబోతోంది. ఒక గ్రామంలో కులం మధ్య జరిగే గొడవలు నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో యాంకర్ అనసూయ అక్కమ్మ అనే కీలక పాత్రలో నటిస్తోందట. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. సెప్టెంబర్ 29వ తేదీన థియేటర్లలోకి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే అనసూయ మాట్లాడుతూ తన క్యారెక్టర్ గురించి వివరించింది.
సాధారణంగా అనసూయ మాట్లాడుతుందంటే చాలు పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అనసూయ అలా మైక్ తీసుకుందో లేదో ఒక్కసారిగా అక్కడున్న ఆడియన్స్ అందరూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ గోల చేయడంతో..ఆమె ఇలా మైక్ తీసుకొని మాట్లాడుతూ.. మీరు ఇలా అరవడంతో నన్ను పొగుడుతున్నారా ? లేక తిడుతున్నారా? అర్థం కావడం లేదు అంటూ కామెంట్ చేసింది. అనసూయ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించినప్పుడు అందరూ నన్ను రంగమ్మత్త అనే పేరుతోనే పిలిచారు. ఇప్పుడు ఈ సినిమాలో అక్కమ్మ పాత్ర పోషిస్తున్నాను. ఇక ఇప్పటినుంచి అక్కమ్మ గా నన్ను పిలుస్తారేమో అంటూ కామెంట్ చేసింది. మొత్తానికైతే అనసూయ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.