ప్రముఖ యుట్యూబర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన దీప్తి సునైన.. గురించి చెప్పాల్సిన పని లేదు.. యూట్యూబ్లో ప్రైవేట్ సాంగ్స్, కవర్ సాంగ్స్ తో పాటు పలు రకాల వెబ్ సిరీస్ లతో మంచి పాపులారిటీ అందుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ -2 లో అడుగుపెట్టి మరింత క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది దీప్తి సునైన.


ఆ తర్వాత కొన్నాళ్లకు షణ్ముఖ్ తో కూడా బ్రేకప్ చెప్పిన ఈమె ఆ తర్వాత సింగిల్గానే ఉన్నది.. ఈ మధ్య లో కూడా ఈమె నుంచి ఎటువంటి ప్రవేట్ సాంగ్స్ కూడా పెద్దగా రాలేదు.. వాటిని కూడా ఆడియన్స్ నిరోత్సాహంలో ఉన్నారు. ఒక పక్క సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కుర్రకారులకు నిద్రలేకుండా చేస్తున్న ఈమె తాజాగా ఇప్పుడు మరొకసారి ఫోటోషూట్లతో అదరగొట్టేస్తోంది.. దీప్తి సునైన.. పర్పుల్ కలర్ శారీలో తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


ఇదంతా బాగానే ఉన్న ఈ ఫోటోలకు దీప్తి క్యాప్షన్ ని ఇలా రాసుకోస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.."తన ఫోటోలకు నీలో ఉంది నా ప్రాణం అని నీకు తెలుసునా" అనే విధంగా క్యాప్షన్ ఇవ్వడంతో ఈ క్యాప్షన్ పైన నేటిజెన్స్ సైతం పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.. నీ ప్రాణం తనలో ఉందా అతను ఎవరు అంటూ కామెంట్స్ చేయక మరి కొంత మంది మళ్ళీ దీప్తి ప్రేమలో పడింది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అమ్మడు ఎందుకు క్యాప్షన్ పెట్టిందో తెలియదు కానీ తాజా ఫోటో షూట్లు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: