
ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా వ్యవహరించిన రోజా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. పొలిటికల్పనంగా వైసీపీ పార్టీలో మంత్రిగా కూడా పనిచేసే ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది రోజా. జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఎంతోమంది కమెడియన్స్ కి సహాయం చేయడమే కాకుండా వారందరితో కలిసిమెలిసి ఉండేవారు. తాజాగా రోజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన కిరాక్ ఆర్పి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సినీ ఇండస్ట్రీలో కానీ మరెక్కడైనా కానీ తనకి పరిచయం ఉన్న వారందరికీ కూడా తిరుమల తిరుపతి దర్శనానికి టికెట్లు కావాలి అంటే తానే తీసి ఇచ్చాను ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి ఎప్పుడు అడగలేదు.. తనకు కావలసిన వాళ్లు వస్తే అది చిన్న పెద్ద అని చూడకుండా అందరికీ తోచిన సహాయం చేశానని. అలా చూసినారే ఈరోజు ఎగస్ట్రాలు గా మాట్లాడుతున్నారు.. తనతో ఉన్నవారిలో అందరికీ కృతజ్ఞత ఉంది.. వాడికి మాత్రం లేదు ఖచ్చితంగా వాడికి దేవుడు ఏదో ఒక రోజు పనిష్మెంట్ ఇస్తాడు అంటూ తెలియజేసింది.
రోజా ప్రముఖ కమెడియన్ కిరాక్ ఆర్పిని ఉద్దేశించే కామెంట్లు చేసినట్లు పలువురు నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మంత్రి రోజా, కిరాక్ ఆర్పీ మధ్య కూడా జరిగిన మాటల యుద్ధం గురించి చెప్పాల్సిన పనిలేదు. కిరాక్ ఆర్పి కి జనసేన పార్టీ నుంచి మద్దతు రావడంతో రోజా పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పటినుంచి ఇక వీరిద్దరి మధ్య ఈ వార్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు షోలలో కిరాక్ ఆర్పి, రోజాను పలు రకాలుగా చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా రోజా, కిరాక్ ఆర్పి పైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి