
తాజాగా ప్రముఖ టాక్ షో కి హాజరైన సౌమ్యరావు తన జీవితంలో ఎదురైన కష్టాలు, కెరియర్స్ గురించి తెలియజేసింది. తాజాగా ప్రోమో వైరల్ గా మారగా ప్రోమోలో.. వర్ష మాట్లాడుతూ.. సౌమ్య వచ్చిందంటే ట్రోల్ అవుతాది అంటు ఒక పాటతో వెల్కమ్ చెప్పగా ఏంట్రా నన్ను ట్రోల్ చేయడానికి పిలిచావా అంటూ సౌమ్యరావు ఫన్నీగా మాట్లాడుతుంది.. ఆ తర్వాత సౌమ్యా అందరి ఇంటర్వ్యూ న్యూ చేస్తావు కదా ?ఈసారి నీ ఇంటర్వ్యూ నేను చేస్తానంటూ ఏదో కన్నడలో ప్రశ్నించగా..? వర్షకి అర్థం కాని పరిస్థితిలో ఫేస్ పేడుతుంది.
అంతేకాకుండా ఒక పెద్ద హీరో నీ నెంబర్ తీసుకొని.. సౌమ్య నీతో మాట్లాడాలి రా అంటూ చెప్పారట కథ అంటూ వర్ష అడగగా నీకు దండం పెడతా ఆ మేటర్ మాత్రం వద్దురా అంటూ తెలిపింది సౌమ్యరావు.. ఇక అక్కడి నుంచి చాలా ఎమోషనల్ గా సాగుతుంది ప్రోమో. ముఖ్యంగా తన తల్లిదండ్రుల గురించి చెబుతూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. తన కుటుంబం మొత్తం ఎన్నో సార్లు పస్తులుండి బస్టాండ్ లో పడుకున్నా సందర్భాలు ఉన్నాయని ,సినీ ఇండస్ట్రీలో పెద్ద సిండికేట్ జరుగుతోంది అంటూ ఉదయభాను గారు చెప్పింది నిజమే అంటూ తెలిపింది. ఈ విషయం పైన కూడా మాట్లాడుతూ ఒక సీరియల్ చేస్తున్న సమయంలో ఒక హీరో, హీరోయిన్ మధ్య ఏదో పర్సనల్ విషయం ఉండేది.. షూటింగ్ అంతా ప్యాకప్ అయిన తర్వాత అబ్బాయి తనతో మాట్లాడుతున్న విషయాన్ని చూసి ఆ హీరోయిన్ కారు రివర్స్ గేర్ వేసుకొని వచ్చి మరి తనకు తగిలించిందని తెలిపింది సౌమ్యరావు. అలాగే ఒక సమయంలో స్టార్ హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళుతున్నప్పుడు తనకు పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని తన కాలు మొత్తం బ్లడ్ కారుతోందని తెలియజేస్తే చాలా ఎమోషనల్ గా మాట్లాడిన ప్రోమో వైరల్ గా మారుతోంది.