శామ్సంగ్ గెలాక్సీ ఎ 22 5 జి ఫోన్ కి 4 జిబి ర్యామ్ ఇంకా 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వుంది.ఇక దీని ధర వచ్చేసి 229 యూరోల నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఇండియన్ కరెన్సిలో దాదాపుగా దీని ధర 20,300/- నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 4GB + 128GB అలాగే 6GB + 128GB రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది, అయితే ధరలు ఇంకా వెల్లడి కాలేదు.ఇక కలర్ల విషయానికి వస్తే గెలాక్సీ ఎ 22 5 జి గ్రే కలర్ లోనూ ఇంకా పుదీనా కలర్లోనూ, వైలెట్ ఇంకా తెలుపు నాలుగు రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. గెలాక్సీ A22 4G 4GB + 64GB, 4GB + 128GB ఇంకా 6GB + 128GB మూడు కాన్ఫిగరేషన్లలో కూడా వస్తుంది. శామ్సంగ్ 4 జి వేరియంట్ ధర అలాగే లభ్యత వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీని కలర్స్ విషయానికి వస్తే నలుపు, పుదీనా, వైలెట్ ఇంకా తెలుపు రంగులలో లభిస్తుంది.స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే గెలాక్సీ ఎ 22 5 జిలో 6.6-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది.ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఇది 1TB వరకు స్టోరేజ్ కలిగి ఉంది.అలాగే ఇది మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది. గెలాక్సీ ఎ 22 5 జిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఇది 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి