రోజు రోజుకీ టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందుతూ ఉందో మనము చూస్తూనే ఉన్నాము. దీనితో మనకు వివిధ రకాలుగా మన అకౌంట్ సెక్యూరిటీ విషయంలో సమస్యలు వస్తున్నాయి. అంటే మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవ్వడం, మన ఫోన్ పే లేదా జి పే లలో అమౌంట్ కట్ అయిపోవడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. వీటినే మన పోలీసు శాఖ సైబర్ క్రైమ్ గా గుర్తించింది. సంవత్సరం సంవత్సరానికి సైబర్ క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. వీటిని తగ్గించడానికి పోలీసు శాఖ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కొన్ని విషయాలను ప్రకటనల రూపంలో చెబుతుండటం మనము చూశాము అటువంటి వాటిలో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.

* మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన ఎటువంటి వివరాలను మీ చుట్టు పక్కల వారితో చెప్పకండి. ఎందుకంటే డబ్బు మీద ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. రేపు మీ పక్కింటి వారే మోసం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

* మీరు అవసరానికి బ్యాంకుకు వెళ్ళినా లేదా ఏటీఎం సెంటర్ కి వెళ్ళినా పాస్ బుక్ లేదా ఏటీఎం ను వాడిన తరువాత మర్చిపోకుండా మళ్లీ మీ వెంటే తీసుకు రండి. ఒకవేళ ఎక్కడైనా మరిచిపోయారా మీ అకౌంట్ హ్యాక్ అయ్యే అవకాశం..లేదా అమౌంట్ ఎవ్వరైనా దొంగిలించే అవకాశం ఉంటుంది.  

* మీ ఏటీఎం కు పాస్వర్డ్ ను కష్టంగా ఉండే విధంగా సెట్ చేసుకోండి. ఉదాహరణకు కొంతమంది 1234, 0000, ఇలా వరుస నంబర్స్ ను లేదా సులభంగా తెలుసుకోగలిగే నంబర్స్ పెట్టుకోకండి.

* మీకు తెలియని నంబర్ నుండి ఫోన్ చేసి మీ అకౌంట్ వివరాలు లేదా ఆధార్ కార్డ్ వివరాలు అడిగితే ఎటువంటి పరిస్థితుల్లో వారికి చెప్పకండి. ఒకవేళ చెప్పారా మీ అమౌంట్ హుష్ కాకి అయిపోతుంది. తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు.

* మీరు ఉపయోగించే ఆన్లైన్ పేమెంట్ యాప్ లలోనూ పాస్వర్డ్ లు దృఢంగా ఉండేలా క్రియేట్ చేసుకోండి.

* మీకు లాటరీ వచ్చినట్టు, గిఫ్ట్ వచ్చినట్టు ఏవేవో మెసేజ్ లు వస్తుంటాయి. అందులో ఒక లింక్ కొద ఉంటుంది. కానీ ఈ లింక్ ను క్లిక్ చేశారో మీ ఫోన్ వివరాలు అన్నే వారికీ తెలిసిపోతాయి. తద్వారా మీరు అమౌంట్ కోల్పోయే ప్రమాదం ఉంది.

ఈ విధంగా పై విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకుని అనుసరించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: