సెకండ్‌ హ్యండ్‌లో మొబైళ్లను కొంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడే అకాశం ఉంది. ఒకసారి వాడిన స్మార్ట్‌ఫోన్‌ కనుక మళ్లి కొంటే అన్ని వివరాలు చెక్‌ చేసుకోవడం మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరి వద్దనైనా సెకండ్‌ హ్యండ్‌ ఫోన్‌ కొనే ముందు ఖచ్చితంగా జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలి. ఏం ఆలోచించకుండా కొనుగోలు చేస్తే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం చాలానే ఉంది. అయితే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ పోగొట్టుకున్న, చోరీకి గురైన ఫోన్‌లను ట్రాక్‌ చేసేందుకు సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ పోర్టల్‌ ద్వారా ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.ఇక ఈ పోర్టల్‌ ద్వారా మీరు సెకండ్‌ హ్యండ్‌ కొనుగోలు చేసే మొబైల్‌ ఒవరినలా..? కాదా అనే విషయాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు.అయితే మీరు ముందుగా CEIR అనే పోర్టల్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత అక్కడ మైన్‌ పేజ్‌లో అప్లికేషన్‌లోకి వెళ్లి అక్కడ Know Your mobile App, లేదా IMEI Verification అనే రెండు ఆప్షన్స్‌ అనేవి కనిపిస్తాయి. వీటిలో IMEI Verification రెండింటిని ఎంచుకోండి.


తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌ను అక్కడ నమోదు చేయండి. తర్వాత మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని కూడా నమోదు చేయండి. తర్వాత ఐఎంఈఐ సూచించిన కాలంలో ఇమెయిజ్‌ నెంబర్‌ను కూడా నమోదు చేయాలి. ఒకవేళ మీరు తీసుకున్న మొబైల్‌ IMEI నెంబర్‌ తెలియకపోతే మొబైల్‌లో *#06# ప్రెస్‌ చేస్తే మీకు స్క్రీన్‌పై అది కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మీరు ఐఎంఈఐ నెంబర్‌ను నమోదు చేసి సబ్మిట్‌పై నొక్కాలి. వెంటనే వివరాలు వస్తాయి. ఇలా తెలుసుకోవడం వల్ల మీరు కొన్న సెకండ్‌ హ్యండ్‌ ఫోన్‌ అది ఒరిజినలా..? లేదా..? అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే దొంగిలించిన ఫోన్లు చాలా మంది కూడా అమ్మేసుకుంటారు. అందుకే ముందు ఇలా చెక్‌ చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే దొంగిలించబడిన ఫోన్‌పై ఎవరైనా పోలీసు కేసు కనుక నమోదు చేసినట్లయితే తర్వాత మీరు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: