ఎన్నో వింతలు విశేషాలకు చిరునామా అయినా సోషల్ మీడియాలో ఎప్పుడు ఆసక్తికర వీడియోలు దర్శనమిస్తూనే ఉంటాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన జీవనశైలి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే వీడియోల ద్వారా తెలుసుకోవడానికి నేటిజన్స్ అందరూ కూడా ఎక్కువగా ఆసక్తి చెబుతూ ఉంటారని చెప్పాలి. అయితే ఇక అడవి జంతువులలో ఎంతో ప్రమాదకరమైన జీవులు ఏవి అంటే పులులు సింహాలు అని చెబుతూ ఉంటారు. అయితే వీటితోపాటు అటు నీటిలో ఉండే ముసలి కూడా అంతే ప్రమాదకరమైనది అనే విషయం తెలిసిందే.


 అడవి మొత్తానికి సింహం రారాజు అంటూ ఉంటారు. కానీ నీటిలో ఉంటే మాత్రం సింహాన్ని సైతం భయపెట్టే బలాన్ని కలిగి ఉంటుంది మొసలి. అంతేకాదు ఇక నీటి అడుగున ఉండి ఎంతో చాకచక్యంగా వేటాడటం చూస్తూనే ఉంటాం   ఏదైనా జంతువు దప్పిక తీర్చుకోవడానికి వచ్చిందంటే చాలు ఆహారం దొరికింది అని సంబరపడిపోతూ ఉంటుంది మొసలి. ఈ క్రమంలోనె రెప్పపాటు కాలంలో దాడి చేసి ఎన్నో జంతువులను ఇక ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది అని చెప్పాలి.


 కొన్ని కొన్ని సార్లు మొసలి మెరుపు వేగంతో చేసే దాడులు చూసిన తర్వాత ఇది నిజమేనా అని మన కళ్ళని మనమే నమ్మలేము అని చెప్పాలి.  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదిక వైరల్ గా  మారిపోయింది. అడవిలో ఉన్న ఒక నీటి కొలను వద్ద చిన్న జింక పిల్ల  నీరు తాగుతూ కనిపిస్తుంది. అయితే అక్కడి వరకు అక్కడ అంతా ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ రెప్పపాటు కాలంలో నీతి అడుగు నుంచి దూసుకు వచ్చిన మొసలి ఏకంగా జింకను పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ వెంటనే అప్రమత్తమైన జింక వెంటనే గాల్లోకి ఎదురు మొసలి దాడి నుంచి తప్పించుకుంది. ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: