ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అనేక వింతలున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో వింత. ఇప్పుడు అందులో రాత్రి, పగలు కూడా చేరాయి. అవును కొన్ని దేశాల్లో రాత్రి రానేరాదు. మరి కొన్ని దేశాల్లో పగలు ఊసైనా ఉండదు. ఈ చిత్ర విచిత్రాలేవో తెలుసా..? నార్వే, ఫిన్‌లాండ్‌, స్వీడన్‌, ఐస్‌ల్యాండ్, అలస్కా. వీటితో మరి కొన్ని దేశాలూ ఉన్నాయి. ఈ దేశాల్లో కొన్నింటిలో రాత్రింబవల్లు పగటి పూటలా సూర్యుడు దర్శనమిస్తుంటాడు. మరికొన్ని దేశాల్లో చీకటి రాజ్యమేలుతూ ఆకాశంలో చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ వింత వాతావరణం ఉన్న దేశాల్లో కొన్నింటి ప్రత్యేకతల గురించి వివరిస్తాను తెలుసుకోండి.

నార్త్ యూరప్ ప్రాంతంలోని దేశం నార్వే. ఈ దేశానికి కింగ్‌డమ్‌ ఆఫ్‌ నార్వే, యూనిటరీ, మొనార్చీ అని పేర్లున్నాయి. ఎత్తైన, మంచు పర్వతాలలు ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ దేశం చాలా చల్లగా ఉంటుంది. అయితే ఇక్కడే మనకు ఓ వింత కనిపిస్తుంది. సాధారణగా భారత్ వంటి సమశీతోష్ణ దేశంలో మే, నుంచి జూలై వరకు ఎండాకాలం ఉంటుంది. ఆ సమయంలో సూర్యుడి ప్రతాపం ఎక్కవగా ఉంటుంది. ఈ దేశంలో కూడా అంతే. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది.

అదేంటంటే ఇక్కడ మే నుంచి జూలై వరకు సూర్యుడు తిష్ఠ వేసుకుని ఉండిపోతాడు. దాదాపు 20 గంటల పాటు ఈ దేశంలో పగలు ఉంటుందంటే ఇక అర్థం చేసుకోండి. దీని కారణంగానే ఈ దేశానికి మిడ్‌నైట్‌ సన్‌ ల్యాండ్‌ అని కూడా పేరు పెట్టేశారు. అర్ధరాత్రయినా సూర్యుడు దేద్దీప్యమానంగా వెలిగిపోతుంటాడు. దీంతో ఇక్కడి వారంతా గడియారాలపై ఆధారపడి తమ నిత్యకృత్యాలు సాగిస్తుంటారు. నిద్రపోతుంటారు. విచిత్రంగా ఉంది కదూ.



ఇప్పటివరకు రాత్రి రాని దేశం గురించి చదివారు. ఇప్పుడు పగలు లేని దేశం గురించి తెలుసుకుందాం. ఈ దేశం కూడా నార్త్ యూరప్‌లోనే ఉంది. ఇంకా మాట్లాడితే నార్వేకు కొంత దూరంలోనే ఉంటుంది. యూరప్‌కు చెందిన స్వతంత్ర ద్వీపాలలో ఫిన్‌ల్యాండ్ ఒకటి. స్వీడన్‌ నుంచి వేరుపడి స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇక్కడ దాదాపు 6మిలియన్ల జనాభా నివశిస్తుంటారు. ఉత్తర, దక్షిణ సముద్ర తీరాల్లో వాతావరణంలో విచిత్ర మైన మార్పులు సంభవిస్తుండడంతో ఈ దేశంలో కూడా పగలు రాత్రి విచిత్రంగా మారిపోతుంటాయి.
 
పడమరన అస్తమించాల్సిన సూర్యుడు వేసవిలో ఏకంగా 73 రోజుల పాటు ఉత్తర దిశలో అస్తమిస్తాడు. అలాగే మరో 51 రోజులు కంటికి కూడా కనిపించడు. ఈ సమయంలో వీరు కూడా తమ గడియారాలపైనే ఆధారపడి పని చేసుకుంటూ ఉంటారు. చూశారు కదా వింత దేశాలు. ఇక వీటితో పాటు స్వీడన్, ఐస్‌ల్యాండ్ వంటి యూరప్ దేశాలు, అలస్కా వంటి ఉత్తర అమెరికా దేశాలు కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: