కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విక్రమ్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సదా హీరోయిన్ గా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2005 వ సంవత్సరం జూన్ 17 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. 

సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు కూడా వచ్చాయి. ఇక ఈ మూవీ లోని విక్రమ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీ తో విక్రమ్ క్రేజ్ తెలుగులో కూడా భారీగా పెరిగింది. అలాగే సదా కు కూడా ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రావడం మొదలు అయింది. ఇక ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాని తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వెలువడింది.

మూవీ ని మే 17 వ తేదీన థియేటర్ లలో రీ రిలీస్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మధ్య కాలంలో రీ రిలీస్ అయిన చాలా సినిమాలు అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. ఇక ఈ మూవీ కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను రీ రిలీస్ లో భాగంగా జనాల నుండి తెచ్చుకుంటుంది అని చాలా మంది భావిస్తున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి రెస్పాన్స్ ను రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: