తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి అంజలి తాజాగా "గీతాంజలి మళ్లీ వచ్చింది" అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ 2014 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న గీతాంజలి సినిమాకు కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా గీతాంజలి మూవీ చేసిన మ్యాజిక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర రిపీట్ చేయలేక పోయింది. దానితో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయిన చాలా తక్కువ రోజుల్లోనే "ఓ టి టి" లోకి రావడానికి రెడీ అయింది.

అందులో భాగంగా ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. ఇక ఆహా సంస్థ వారు కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను మే 8 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఏ సమయానికి ఈ సినిమాని "ఓ టి టి" లోకి తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని మాత్రం ఈ సంస్థ వారు ప్రకటించలేదు. దానితో ఈ సినిమాను చూడాలి అని ఆసక్తి ఉన్నవారు మే 8 వ తేదీ రాగానే అర్ధరాత్రి నుండి ఈ మూవీ చూడడానికి ప్రయత్నించారు. కానీ ఆహా యూనిట్ మాత్రం ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురాలేదు. దానితో ఈ మూవీ విడుదల ఉంటుందా ..? లేదా అని అనుమానాలు కూడా జనాల్లో రేకెత్తాయి. ఆ తర్వాత ఈ సినిమాను రాత్రి ఏడు గంటలకు ఆహా ప్లాట్ ఫామ్ వారు జనాల ముందుకు తీసుకువచ్చారు. అలా ఈ మూవీ ని ఎనిమిదవ తేదీన చాలా లేటుగా ప్రేక్షకుల ముందుకు ఆహా సంస్థ వారు తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: